అన్వేషించండి

Bigg Boss 17 Winner: ప్రియాంకా చోప్రా కజిన్, హీరోయిన్ మన్నారాకు షాక్ - 'బిగ్ బాస్ 17' విన్నర్ అతడేనా?

Mannara Chopra - Bigg Boss 17 Finale: బిగ్ బాస్ సీజన్ 17లో మన్నారా చోప్రాకి టాప్ 3 లిస్ట్ లో చోటు దక్కలేదని టాక్.

Bigg Boss 17 Big shock to Mannara Chopra: టెలివిజన్ రంగంలో బిగ్గెస్ట్ రియాల్టీ షోగా పేరొందిన 'బిగ్ బాస్'కి ఆడియన్స్ నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ రోజు 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ మంచి సక్సెస్ సాధించడంతో ఇతర భాషలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరికొన్ని భాషల్లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో కింగ్ నాగార్జున హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల పూర్తి అయ్యింది.

బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 17 ఈ రోజు (జనవరి 28) ఫినాలే జరగనుంది. అయితే... ఈసారి కప్ కొట్టే రేసులో ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లో నిలిచారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ఉంది. కథానాయికగా తెలుగు హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్నారా చోప్రా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ అవుతుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 17లో ఎంట్రీ ఇచ్చి తన బిహేవియర్, ఆట తీరుతో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్ లోను తన పొటెన్షియాలిటీ చూపించింది.

ముఖ్యంగా హౌస్ లో ఎమోషన్స్ చూపించడం, తప్పులను నిజాయితీగా ఒప్పుకోవడం, ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఆడడంతో సీజన్ 17 లోని బెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. తోటి కంటెస్టెంట్స్ లాగా పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా హౌస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో ఈ సీజన్ లో మన్నారాను విజేతగా నిలబెట్టవచ్చనే మాటలు సైతం వినిపించాయి. కానీ, ఇప్పుడు మన్నారా చోప్రా టాప్ 3 లిస్టులో కూడా ఉండకపోవచ్చని హిందీ టీవీ వర్గాల సమాచారం. ఆమెకు పెద్ద షాక్ ఖాయమని అంటున్నారు. ఆర్మ్యాక్స్ నివేదిక ప్రకారం... సీజన్ 17లో మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ మునావర్ ఫరూఖీ ఉన్నాడు. అతను విన్నర్ అని లీక్స్ వచ్చాయి. సెకండ్ ప్లేస్ లో అంకిత ఉంటే అభిషేక్ కుమార్ టాప్ త్రీ లో నిలిచాడు.

Also Read: పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

మన్నారా చోప్రా నాలుగో స్థానంలో ఉన్నారట. అరుణ్ మహాశెట్టి ఐదు స్థానంలో ఉన్నాడు. ఈ పోల్ ఆధారంగా అంకిత, అభిషేక్ టాప్ త్రీ ఫైనలిస్ట్ లో ఉండే అవకాశం ఉందని మునావర్ ఈ సీజన్ కి విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మొదటినుంచి హౌస్ లో బెస్ట్ కంటెస్టెంట్ గా1 పేరు తెచ్చుకున్న మన్నారా కి మాత్రం టాప్-3 లిస్టులో చోటుదక్కకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఇక మన్నారా చోప్రా విషయానికొస్తే.. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ 2014లో 'ప్రేమ గీమా జాన్ తానై' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. సునీల్ తో కలిసి 'జక్కన్న' సినిమాలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తిక్క, సీత వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు పలు తమిళ, హిందీ సినిమాలు చేసింది.

ALso Read: మెగాస్టార్ కెరీర్‌లో మరో రికార్డ్ - 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారంటే?

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget