News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sai Pallavi Marriage: సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? వైరల్ పిక్ వెనుకున్న అసలు కథేంటి?

హీరోయిన్ సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లిదండ‌తో ఉన్న ఫోటో ఒక‌టి వైర‌ల్‌ కావడంతో నిజంగానే పెళ్లి చేసుకుందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

FOLLOW US: 
Share:

Sai Pallavi Viral Wedding Pic: నటి సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ప్రేమమ్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తొలి చిత్రంతోనే చక్కటి విజయాన్ని అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అద్భుత నటన, అంతకు మించిన డ్యాన్స్ తో కొద్ది సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  

సాయి పల్లవి రహస్యంగా పెళ్లి చేసుకుందా?

సినిమా విషయాలు మినహా, తన వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా చూసుకుంటుంది సాయి పల్లవి. అయితే, తాజాగా సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా మెడలో దండలు ఉన్న ఫోటో ఒకటి బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ ఫోటోలో సాయి పల్లవి పక్కన మరో వ్యక్తి మెడలో దండవేసుకుని కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆమె నిజంగానే పెళ్లి చేసుకుందా? అని ఆరా తీయడం మొదలు పెట్టారు.

సాయి పల్లవి పెళ్లి వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు వేణు  

ఈ వార్తలకు ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సాయి పల్లవి పెళ్లి చేసుకుందంటూ వైరల్ అవుతున్న ఫోటో వెనుకున్న అసలు కథను ఆయన చెప్పారు.”ఈ ఫోటో నటుడు శివ కార్తికేయ త‌మిళ సినిమా పూజా కార్య‌క్ర‌మంలోనిది” అంటూ ఫేస్ బుక్‌లో వేణు పోస్టు పెట్టారు. దీంతో ఆమె పెళ్లి చేసుకుందనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. సోషల్ మీడియాలో సాయి పల్లవితో పాటు మరో వ్యక్తి ఉన్న ఫోటో మాత్రమే వైరల్ కాగా, వేణు ఫుల్ ఫోటోను పోస్టు చేసి ఊహాగానాలకు చెక్ పెట్టారు. అటు ఫ్యాన్స్ కూడా అసలు విషయం తెలుసుకుని రిలాక్స్ అయ్యారు.      

వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదే

ప్రస్తుతం తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి శివకార్తికేయన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.  ప్రస్తుతానికి ఈ చిత్రానికి #SK21 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.  ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది.  ఈ వేడుకలో భాగంగా చిత్రబృందానికి మెడలో పూల మాల వేసి స్వాగతం పలికారు. వైరల్ ఫోటోలో సాయి పల్లవి, దర్శకుడు పెయిరసామి దండలతో కనిపించారు. దీంతో అసలు విషయం తెలియక చాలా మంది వారి పెళ్లి అయ్యిందని ప్రచారం చేయడం మొదలు పెట్టారు.   

వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి

సాయి పల్లవి శివ కార్తికేయన్ తో తొలిసారి కలిసి నటిస్తోంది. ఈ సినిమాకు రాజ్‌ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. అటు చందూ మొండేటి, నాగ చైతన్య కాంబోలో వస్తున్నన #NC 23లోనూ హీరోయిన్ గా చేస్తోంది. అటు అమీర్ ఖాన్ కొడుకు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.  జునైద్ ఖాన్ చిత్రంతో ఆమె బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read Also: అట్లీపై నయనతార అసంతృప్తి, అసలు కారణం దీపికేనా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 21 Sep 2023 05:07 PM (IST) Tags: Sai Pallavi Sai Pallavi Marriage Sai Pallavi marriage photos Sai Pallavi husband Rajkumar Periyasamy director

ఇవి కూడా చూడండి

Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!

Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్​లో ధాత్రి

Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్​లో ధాత్రి

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Ravi Bishnoi: టీ20 నెంబర్‌ వన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్

Ravi Bishnoi: టీ20 నెంబర్‌ వన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్

Telanagna Politics: కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?

Telanagna Politics: కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?