అన్వేషించండి
Advertisement
Dhanush Rolls Royce Car: పన్ను ఎగ్గొట్టిన స్టార్ హీరో.. అక్షింతలేసిన హైకోర్టు..
తాజాగా ధనుష్ వేసిన పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మధ్యకాలంలో కోలీవుడ్ స్టార్ హీరోలు పన్ను ఎగ్గొట్టం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే హీరో విజయ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారుకి పన్ను ఎగ్గొట్టారనే విషయంలో కోర్టు మెట్లెక్కారు. పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ విజయ్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టిపారేసింది. పన్ను ఎగ్గొట్టాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని.. బాధ్యతగా వ్యవహరించాల్సిన సినీ సినీతారలే ఇలా పన్ను కట్టేందుకు వెనకాడటమేంటని ప్రశ్నించింది.
ఈ విషయంలో విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఆయన్ను దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో విజయ్ పన్ను కట్టడానికి అంగీకరించారు. ఈ ఉదంతం మర్చిపోక ముందే మరో స్టార్ హీరో ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నారు. 2015లో ధనుష్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారుని కొనుగోలు చేశారు. విదేశాల నుండి దానిని దిగుమతి చేసుకున్నందుకు గాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. ధనుష్ కూడా అదే ఏడాదిలో మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు.
తాజాగా ధనుష్ వేసిన పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారని ధనుష్ ను నిలదీసింది. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు వీఐపీలకు ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నించింది. ఇప్పటికే తాను యాభై శాతం పన్ను చెల్లించానని.. మిగిలిన మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న కట్టేస్తానని ఆయన సమాధానమిచ్చారు.
ఇక ధనుష్ కెరీర్ విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన 'అసురన్', 'కర్ణన్' లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. 'జగమే తంత్రం' సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ధనుష్ తమిళంలో 'మారన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. ఇది కాకుండా హాలీవుడ్ లో 'గ్రేమ్యాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించనున్నారు. భారీ బడ్జెట్ తో సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
మొబైల్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement