Devatha July 8th Update: మాధవకి రాధ స్ట్రాంగ్ వార్నింగ్, రుక్మిణి ఫోటో పంతులకి చూపిద్దామని గుడికి వెళ్ళిన దేవుడమ్మ- ఫోటో తీసి దాచిపెట్టిన సత్య
రుక్మిణి కోసం దేవుడమ్మ ఆరాటపడుతుంది. తనని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని ప్రయత్నిస్తుండటంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
దేవుడమ్మ పూజ చేసుకుంటూ ఉంటుంది. ‘నా ఆశ ఆశగానే మిగిలిపోతుంది. లేదనుకున్న నా కోడలు బతికే ఉందని చల్లని వార్త తెలిసేలా చేశావ్ తనతో పాటు మా వంశాంకురం కూడా ఉందన్నమాట తెలిసాక నా ఆనందానికి అవధులు లేవు. కానీ కళ్ళారా చూసుకునే అవకాశం లేకుండా చేశావ్. అసలు నా రుక్మిణి ఎక్కడమ్మా, నా బిడ్డకి పుట్టిన బిడ్డ ఎక్కడమ్మా’ అని ఆవేదనగా దేవుడమ్మ దేవుడు ముందు మొరపెట్టుకుంటుంది. ‘మనవడినో, మనవరాలినో ఎత్తుకోవాలనే నా కోరిక మీద నీకు ఎందుకు దయకలగడం లేదమ్మా త్వరగా నా కోడలు నా ఇంటికి చేరేలాగా కనికరించు తల్లి’ అని వేడుకుంటుంది. పంతులుగారు ఇచ్చిన వాయనం చూసుకుని ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది.
ఇంతలో భాగ్యమ్మ అక్కడికి వస్తుంది. రుక్మిణి బతికే ఉందని తెలిసినప్పుడు నాకు ప్రాణం లేచి వచ్చింది. త్వరలోనే మన అందరి బాధ తీరిపోతుందని భాగ్యమ్మకి చెప్పి అక్కడ నుంచి దేవుడమ్మ వెళ్ళిపోతుంది. ‘నా బిడ్డ, మనవరాలు ఎక్కడో లేరు తల్లి ఇక్కడే ఉన్నారు నీ కంట పడలేక దాగుడు మూతలు ఆడుతున్నారు. నీ బాధ చూస్తుంటే నీకు నిజం చెప్పాలని అనిపిస్తుంది కానీ నీ కోడలు నా నోరు తెరవకుండా`కట్టేసింది’ అని మనసులో కుమిలిపోతుంది. ఇక ఇంట్లోకి వస్తున్న రాధని మాధవ దేవి ఎక్కడ అని అడుగుతాడు. నా పెనివిటి దగ్గరకి పోయిందని చెప్తుంది.. నువ్వే పంపించావ అని అడుగుతాడు. అలా ఎలా పంపిస్తావ్ నేను దేవి కోసం ఎదురు చూస్తున్నానని తెలుసు కదా అని అంటాడు. ఆ మాటకి అంటే రాధ ఎంది నువ్వు ఎదురు చూసేదీ నీ కేమయితదని ఎదురు చూస్తునవని నిలాదీస్తుంది. అలా అడుగుటవెంటీ రాధ నేను దేవిని నా బిడ్డ లాగా పెంచుకున్నానని చెప్తాడు. ఇంతక ముందునేను అలాగే అనుకున్న కానీ నీ ప్రేమ నా బిడ్డ మీద కాదు అని తెలిసినాక కూడా నీ మాట ఎలా నమ్ముతానని అంటుంది. నా ప్రేమ ఎవరి మీదో తెలిసి కూడా నువ్వు ఇలా చెయ్యడం ఏమైనా బాగుందా అని మాధవ రాధతో అంటాడు.
Also Read: రాత్రంతా జ్వాల(శౌర్య) ఇంటి ముందే వర్షంలో నిల్చున్న హిమ, తాతయ్య-నానమ్మ కన్నీళ్లకు కరగని శౌర్య
నీకు ఇంతక ముందు చాలాసార్లు చెప్పాను. నీలాగా నాకు దిమాక్ కరాబ్ అయ్యిందంటే నీ ఇజ్జత్ తీయడానికి నిమిషం పట్టదని అంటుంది. కానీ నువ్వు అలా చేయవని నాకు తెలుసు రాధ అని మాధవ ధీమాగా చెప్తాడు. ‘ఆడ దాని ఓపిక నీలాంటోడి పతనానికి కారణం అవతది, అశోకవనంలో కూర్చున్న సీతమ్మ అక్కడే ఉంది కానీ అక్కడ కూర్చోబెట్టిన రావణుడు ఏమయ్యాడు.. ఆయన రాజ్యం ఏమైనది, చీర లాగిన ద్రౌపది ఎక్కడ ఉన్నది పాండవుల దగ్గరే కదా. కానీ లాగిన ఆ వంశం ఏమైనది. ఊరుకుంటున్న కదాని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావ్ చివరికి నీ గతి కూడా అలాగే అవతది’ అని రాధ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. పురాణాలలో తప్పు వాళ్ళది రాధ కానీ మన మధ్యలో తప్పు నా మనసుని పాడు చేసిన నీదని అంటాడు. నా కోసం నా బిడ్డ ని అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నావ్, అది నా పెనిమిటి సొంతం ఆడనే ఉంటది. గీ పొద్దు ఆడుకోవడానికి పోతుంది రేపు అక్కడనే ఉండటానికి పోతాది నీకెందుకు సారు అని కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
దేవుడమ్మ రుక్మిణి ఫోటో చూస్తూ నువ్వు ఎక్కడ ఉన్నావా అని మేము ఇంత ఆరాటపడుతున్నాం, కానీ నువ్వు రాకుండా ఈ ఇంటి వారసత్వాన్ని కూడా పంపించకుండా ఉన్నావని బాధపడుతుంది. ఎందుకో ఆ తిరుగు వాయనం నువ్వే ఇచ్చావని నాకు అనిపిస్తుంది, ఆ పూజారి గారు చూశారు కాబట్టి నీ ఫోటో చూపించి అడుగుతాను. ఆయన చూస్తే వాయనం ఇచ్చింది నువ్వే కాదో తెలిసిపోతుంది కదా అని ఆశపడుతుంది. దేవుడమ్మ బయటకి వెళ్తున్న సమయానికి దేవి ఇంటికి వస్తుంది. ఏంటే చిట్టి రాక్షసి ఇన్ని రోజులకి ఇల్లు గుర్తుకు వచ్చిందా అని దేవుడమ్మ అంటే నన్ను చూడాలనిపిస్తే నువ్వే ఇంటికి రావొచ్చు కదా చిన్నదాని నేను ఎలా వస్తా అని దేవి ఎదురు ప్రశ్నిస్తుంది. ఇక దేవుడమ్మ చేతిలో ఉన్న ఫోటోని దేవి ఎక్కడ చూస్తుందో అని భాగ్యమ్మ కంగారుపడుతుంది. దేవుడమ్మని చూస్తూ ‘అది నీ మనవరాలని తెలియకుండానే ఇంత సంబరపడుతున్నావ్, అదే నిజం తెలిస్తే నువ్వు విడిచిపెడతావా కండ్ల ముందు ఉన్నది నీ మనవరాలని నీకు తెలవకపాయే’ అని భాగ్యమ్మ మనసులో బాధపడుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరితో దేవి సరదాగా మాట్లాడుతుంది.
Also Read: క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి
ఇక చిన్మయికి రాధ అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన జానకి నువ్వేమైన చిన్న పిల్లవా నీ చేతితో తినలేవా అని అరుస్తుంది. నిన్నే చూసుకుంటూ ఎవరు ఇక్కడ ఉండరమ్మా, ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి ఇక నుంచి నీ పనులు నువ్వే చేసుకోవడం అలవాటు చేసుకోమని చెప్తూ రాధ వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంది. ఆ మాటలకు చిన్మయి బాధపడుతుంది. ‘రుక్మిణి గురించి దేవుడమ్మ అత్త మస్త్ పరేషన్ అవుతుంది కదా అదంతా నువ్వు చూస్తున్నావ్ కదా రుక్మిణి ఎక్కడ ఉందో నేకు తెలిస్తే చెప్పమ్మా’ అని బాష, కమల అడుగుతారు. కానీ భాగ్యమ్మ తెలియనట్లే ప్రవర్తిస్తుంది. ఎంతకీ చెప్పకపోయేసరికి కమల తన బిడ్డని సత్యకి దత్తత ఇస్తానని చెప్తుంది ఆ మాటకు భాగ్యమ్మ తిడుతూ సత్తెవ్వకి బిడ్డలు పుట్టారా ఏంటి అని అరుస్తుంది. ఇంకోసారి ఆ మాట అంటే మంచిగా ఉండదు.. ఈ ఇంటికి వారసురాలు వస్తదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
దేవుడమ్మ రుక్మిణి ఫోటో పట్టుకుని పూజారిని కలిసేందుకు గుడికి వస్తుంది. రుక్మిణి గురించి పంతులుగారిని అడుగుదామని అనుకుంటుంటే పూజారి ముందు హారతి తీసుకోమని చెప్తాడు. దీంతో దేవుడమ్మ ఆ ఫోటోని పక్కన పెట్టి హారతి తీసుకుని కళ్ళు తెరిచేసరికి ఫోటో అక్కడ ఉండదు. దీంతో కంగారుగా ఫోటో కోసం వెతుకుతూ ఉంటుంది కానీ కనిపించక పోయేసరికి దేవుడమ్మ చాలా బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ ఫోటోని పట్టుకుని సత్య చూస్తుంటుంది. మీరు అక్క ఫోటో తీసుకుని బయలుదేరినప్పుడే నాకు అనుమానం వచ్చింది, అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. ఈ ఫోటో కనిపించలేదని మీరు ఫీల్ అయ్యారు. కానీ ఈ ఫోటో మీకు ఇప్పుడు కనిపించకపోవడమే మంచిది ఆంటీ, అందుకే ఆ దేవుడు కూడా అక్కని మీకు కనిపించకుండా చేస్తున్నాడని సత్య అంటుంది.