అన్వేషించండి

Devatha July 20th Update: మాధవ పైశాచికత్వం, నేను మీ నాన్నని కాదని దేవికి నిజం చెప్పిన మాధవ_ షాక్లో రుక్మిణి

దేవికి ఆదిత్యే తన తండ్రి అనే నిజం చెప్పాలని రుక్మిణి ఉవ్విళ్లూరుతుంది. కానీ మాధవ అలా జరగకుండా చేస్తాడు. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

దేవికి ఆఫీసర్ సార్ మీ నాయన అని ఇప్పుడే చెప్పాలి అని రుక్మిణి అంటుంది. ఆ మాటకి ఆదిత్య సంబరంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మాధవ కోసం దేవి వస్తుంది. అందరూ నన్ను విష్ చేస్తుంటే నువ్వేంటి ఏమి మాట్లాడకుండా ఉన్నావాని దేవి అడుగుతుంది. మాధవ కళ్ల నిండా నీళ్ళతో దేవి వైపు చూస్తాడు. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని దేవి అడుగుతుంది. నువ్వు గెలిచినందుకు సంతోషంగా నిన్ను ఎత్తుకుని తిప్పాలని ఉంది, నా కూతురు గెలిచిందని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది అని ఏడుస్తూ అంటాడు. మరి చెప్పడానికి ఏమైందని దేవి అడుగుతుంది. 

మాధవ: ఇంకా నీ దగ్గర నటించి నిన్ను మోసం చెయ్యలేను. 

దేవి: నువ్వు నన్ను మోసం చేయ్యడమేంటి 

మాధవ: నేను చేస్తున్నది మోసమేనమ్మ, నిజంగా నా బిడ్డ గెలిస్తే నేను ఇలా ఉండగలనా. కానీ ఉన్నానను అంటే కారణం ఏంటి ఈ చలాకీతనం ఈ తెలివి తేటలు నా బిడ్డవే అయితే నేను చాలా ఆనందపడేవాడిని. నీ లాంటి తెలివైన బిడ్డకి నేను తండ్రిని కాలేకపోయాను. అది తట్టుకోలేనంత బాధగా ఉంది. ఇంత కాలం ఒక నిజం దాచాను. ఆ నిజం ఇప్పుడు నీకు చెప్పాల్సిన సమయం వచ్చింది. నువ్వనుకుంటున్నట్టు నేను మీ నాన్నని కాదు. నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కానీ నీ కన్న తండ్రిని కాదమ్మా. దేవుడు అలాంటి అదృష్టం నాకు ఇవ్వలేదు. 

దేవి: షాక్ అవుతూ ఏంది నాయన మజాక్ చేస్తున్నవా? అని అడుగుతుంది. 

మాధవ: ఇప్పటికీ కూడా నేను నిజం చెప్పలేదంటే నేను నీకు చాలా ద్రోహం చేసిన వాడిని అవుతాను. అందుకే నిజం చెప్తున్నానను. నేను మీ నాయన్ని కాదు. 

దేవి: నాన్న నువ్వు అబద్ధం చెప్తున్నావ్ 

మాధవ: నాన్న అని నీకు చెప్పింది అంతా అబద్ధం ఇదే నిజం. నేను నిజంగానే మీ నాన్నని కాదు తల్లి. నువ్వు కడుపులో ఉన్నపుడే రోజు మీ నాన్న తాగి కొట్టడం వల్ల నీ తల్లి చనిపోవాలని అనుకుంది. ఆ సమయంలో నేను చూసి మీ అమ్మని కాపాడాను. ఆ తర్వాత నువ్వు పుట్టవ. మీ ఇద్దరినీ అప్పటి నుంచి నేనే కంటికి రెప్పల కాపాడుకున్నాను. నాదగ్గర క్షేమంగా ఉన్నారు కానీ ఆ దుర్మార్గుడు ఎన్ని బాధలు పెట్టాడో ఎప్పుడు మీ అమ్మ అదే ఆలోచిస్తుంటుంది.  నిద్రలో ఉలిక్కిపడుతూ ఉంటుంది. ఏ భార్యకి అలాంటి భర్త రాకూడదు. ఏ బిడ్డకి అలాంటి తండ్రి ఉండకూడదు. వాడు అంత దుర్మార్గుడు కాబట్టే మీ అమ్మ కూడా నీకు ఇప్పటి వరకూ నిజం చెప్పలేదు. తల్లి మీ నాన్న గురించి చెప్పాను కదా అని ఈ నాన్న కానీ నాన్నని మర్చిపోకమ్మ అంటాడు. 

Also Read: ఖైలాష్ ని చితక్కొట్టిన యష్, వేదకి క్షమాపణ చెప్పనన్న యష్-తగ్గేదెలే అంటున్న వేద

దేవి అదంతా విని ఏడుస్తూ వెళ్ళి రుక్మిణిని కౌగలించుకుంటుంది. నేను నీకు మంచి ముచ్చట చెప్పాలి మీ అమ్మ ఇంతకాలం నీ దగ్గర దాచిపెట్టిన నిజం చెప్పిందంటే నువ్వు మస్త్ ఖుషి అవుతావని రుక్మిణి సంబరంగా చెప్తుంది. కానీ దేవి బాధగా ఉండటం చూసి మీ నాయన ఏం చెప్పాడని అడుగుతుంది. ఆ నాయన మా సొంత నాయన కాదంట కదా, నాయన నిన్ను మస్త్ బాధలు పెట్టాడంట కదా అని దేవి అమాయకంగా అడుగుతుంటే మాధవ క్రూరంగా చూస్తాడు. ఆ మాటలు విని రుక్మిణి షాక్ అవుతుంది. నిన్ను తాగొచ్చి కొట్టడంత కదా అటువంటి కసాయి వాడికా నేను పుట్టింది, అందుకేన ఎప్పుడు సొచ్చాయిస్తూ కూర్చుంటావ్, అయినా గా నాయన గురించి శోకహాయించడం ఏంటమ్మా, వాడు నా కంట పడాలి ఆఫీసర్ సర్ కి చెప్పి కుళ్ళబొడుస్తా అని కోపంగా అంటుంది. అదంతా విని రుక్మిణి కోపంగా మాధవ వైపు చూస్తుంది. 

రుక్మిణి బాధగా ఆదిత్య దగ్గరకి వస్తుంది. ఆదిత్య సంబరంగా దేవికి చెప్పావా తను ఎక్కడ మాట్లాడవేంటి అని అడుగుతాడు. ఎప్పుడు చెప్తావ్ త్వరగా చెప్పు, ఈ రోజు ఇంట్లో అందరినీ సంతోషపెట్టాలి, మనవరాలు లేదనే బాధని అమ్మ మనసులో తీసేయాలి అని మాట్లాడుతూ ఉంటాడు. రుక్మిణి బాధని కన్నీటిని దిగమింగుకుంటూ ఇప్పుడు చెప్పడం కాదు పెనీవీటి తర్వాత చెప్తాలే అంటుంది. అదేంటి రుక్మిణి చెప్తాను అని చెప్పి ఇలా అంటావెంటీ అని అడుగుతాడు. రుక్మిణి బాధగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కారులో వెళ్తూ ఎందుకు రుక్మిణి ఇలా చేశావు, నా బిడ్డని మళ్ళీ నాకు దూరం చేశావని ఆదిత్య బాధపడతాడు. 

Also Read: మనసు తెలుసుకోండి సార్ అని మళ్లీ క్లారిటీ ఇచ్చిన వసు, సాక్షికి పెద్ద షాక్ ఇచ్చిన రిషి అండ్ కో!

'నా కూతురు కాదు అన్నావ్, ఆ అదిత్యకి దగ్గర చెయ్యాలని ప్లాన్స్ వేస్తున్నావ్, నేను ఎంత చెప్పిన నువ్వు మారవ్ రాధ అందుకే దేవి మనసులో వాళ్ళ నాన్నని తీసేశాను, వాళ్ళ నాన్నని దుర్మార్గుడిని చేశాను. ఇప్పుడు చెప్పు ఆదిత్య మీ నాన్న అని. నేను ఇలా చెప్తాను అని ఊహించి ఉండవ్ కదా కానీ చెప్పాల్సి వచ్చింది కాదు కాదు చెప్పేలా నువ్వే చేశావ్. మళ్ళీ దేవికి ఆదిత్య మీ నాన్న అని చెప్పే అవకాశం లేదు డోర్స్ క్లోజ్' మాధవ దారుణంగా మాట్లాడతాడు. రుక్మిణి, దేవి బాధగా నడుచుకుంటూ వెళ్తూ జరిగింది గుర్తు చేసుకుంటారు. నాన్న అన్నీ బాధలు పెడుతుంటే నువ్వెందుకు ఊరుకున్నావ్, నేను కడుపులో ఉన్నాననా, అంత బాధలు పెట్టాడంటే నాయన ఎంత దుర్మరగుడో కదా అని దేవి కోపంతో రగిలిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget