News
News
వీడియోలు ఆటలు
X

Desamuduru Re-Release: అల్లు అర్జున్ అభిమానుల అత్యుత్సాహం, ‘దేశముదురు’ షో ను నిలిపేసిన పోలీసులు

ఏప్రిల్ 8 న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘దేశముదురు’ సినిమాను రీ రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో బన్నీ అభిమానులు అత్యుత్సాహం థియేటర్ల..

FOLLOW US: 
Share:

Desamuduru Re-Release: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్ డే ల సందర్భంగా వారి సినిమాలు మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇప్పటి వరకూ అలా చాలా మంది హీరోల పుట్టిన రోజు సందర్భంగా సినిమాలు రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అభిమానులు కూడా ఎన్నో ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోల సినిమాలు థియేటర్లలో ప్రదర్శించడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఒక్కోసారి వారి అభిమానం శృతి మించడంతో ఊహించని ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో బాణాసంచా కాల్చడం, సీట్ కవర్లు చించడం, స్క్రీన్ ను డ్యామేజ్ చేయడం, అక్కడ ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేయడం వంటి ఘటనలు గతంలోనూ చూశాం. దీంతో థియేటర్ల యజమానులు రీ రిలీజ్ లు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా అలాంటి ఘటనలే అల్లు అర్జున్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్నాయి.

ఏప్రిల్ 8 న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘దేశముదురు’ సినిమాను రీ రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో బన్నీ అభిమానులు అత్యుత్సాహం థియేటర్ల యజమానులను లబోదిబోమనేలా చేసింది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సినిమా రీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద అభిమానుల తాకిడి ఎక్కువైంది. అయితే థియేటర్ లో షో రన్ అవుతుండగానే లోపల టపాసులు పేల్చారు ఫ్యాన్స్. పేపర్లు చించి రచ్చ రచ్చ చేశారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకతో షో ను మధ్యలోనే నిలిపేశారు. దీంతో కొంతమంది అభిమానులు అసహనం వ్యక్తంచేశారు. కొంత మంది అత్యుత్సాహం వలన సినిమాను నిలిపివేయం సరికాదని ఫైర్ అయ్యారట. 

ఇక ఈ ఘటనకు సంబంధించి టాలీవుడ్ సినీ నిర్మాత ఎస్కెఎన్ ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో అభిమానుల అత్యుత్సాహం వలన థియేటర్ లోకి పోలీసులు రావాల్సి వచ్చిందని, దీంతో షో మధ్యలోనే నిలిపివేశారని చెప్పుకొచ్చారు. దయచేసి ఎవ్వరూ థియేటర్ సామగ్రిని ధ్వంసం చేయొద్దని, హాయిగా సినిమా చూసి రావాలని పేర్కొన్నారు. అయితే దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కావాలనే థియేటర్లోకి పోలీసులను తీసుకొచ్చారని మండిపడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. మరికొంత మంది ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ లు అని కొట్టిపడేస్తున్నారు. ఏదేమైనా ఈ రీ రిలీజ్ లు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆరెంజ్’ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్లను కుమ్మేసింది. ఊహించని విధంగా సినిమాకు కలెక్షన్లు వచ్చేశాయి. దీంతో చరణ్ అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే దీనిని బన్నీ అభిమానులు చాలెంజ్ గా తీసుకున్నారు. అందుకే వెంటనే ‘దేశముదురు’ సినిమాను లైన్ లో పెట్టారని టాక్. అయితే ఈ సినిమాకు కూడా బాగానే స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ‘దేశముదురు’ షో రన్ అవుతుండగా థియేటర్ లోకి పోలీసులు రావడం బన్నీ అభిమానులకు నచ్చలేదట. కావాలనే ఇలా చేశారంటూ ఫైర్ అవుతున్నారట. అసలే చరణ్, బన్నీకు మధ్య స్టార్ వార్ నడుస్తుందనే వార్తలు రావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Also Read రవితేజ - వరుణ్ ధావన్ - రానా - ఓ బాలీవుడ్ మల్టీస్టారర్!

Published at : 06 Apr 2023 10:55 PM (IST) Tags: Allu Arjun Bunny TOLLYWOOD Desamuduru Re release

సంబంధిత కథనాలు

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

టాప్ స్టోరీస్

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!

WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్‌! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్‌!