By: ABP Desam | Updated at : 13 Feb 2023 02:55 PM (IST)
రానా నాయుడు సిరీస్‌లో దగ్గుబాటి వెంకటేష్, రానా (Image Credits: Netflix)
RANA Naidu: దగ్గుబాటి వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లను ప్రారంభించారు. వెంకటేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. ‘నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్‌లో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్ కూడా నేనే. అందంగా ఉంది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నాకు సంబంధించిన వాళ్లే. కాబట్టి ఈ సిరీస్‌కు రానా నాయుడు అని కాదు నాగా నాయుడు అనే పేరు ఉండాలి. నాతో మజాక్‌లు వద్దు.’ అని వెంకటేష్ వార్నింగ్ ఇచ్చాడు.
నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న తొలి తెలుగు వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ సిరీస్‌లో హిందీ వెర్షన్ కి సంబంధించిన టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో చాలా డిఫరెంట్ లుక్‌లో వెంకటేష్ కనిపిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి. రానా, వెంకీ తండ్రి కొడుకులుగా ఇందులో నటించినట్లు కనిపించింది.
జైల్లో చేతులకి సంకెళ్లతో బాగా తెల్ల గడ్డంతో ఇందులో వెంకీ కనిపించారు. తండ్రి మీద చెప్పలేనంత ద్వేషంతో రగిలిపోతున్న పాత్రలో రానా నటించారు. తండ్రి వెంకటేష్ తలకి రానా గన్ గురి పెట్టిన సీన్స్ ఇందులో చూపించారు. నేను మీ నాన్నని అని వెంకటేష్ అంటే నువ్వేమైనా మంచి పనులు చేశావా నాన్న అని పిలిపించుకోవడానికి అని రానా అంటాడు. మునుపెన్నడూ వెంకటేష్ ని ఈ లుక్లో చూసి ఉండరు.
పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ ఇది. ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల కాబోతోంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ కోసం తెలుగు సినీ అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ టీజర్ ని నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. "దగ్గుబాటి Vs దగ్గుబాటి కి సమయం వచ్చేసింది. అయితే ఇది మీ రోజువారీ కుటుంబ నాటకం కాదు. బాబాయ్, అబ్బాయ్‌లను ‘రానానాయుడు’లో చూడండి" అని నెట్ ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మామ, అల్లుడు కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడకతప్పదు. భారతీయ నెటీవీటికి తగినట్టు ఇందులో కొన్ని మార్పులు చేసి దీన్ని రూపొందించారు. బాబాయ్, అబ్బాయ్ కలిసి నటిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇది. ఇప్పటి వరకి వీరిద్దరూ కలిసి ఏ సినిమా కూడా చెయ్యలేదు. 'దృశ్యం 2', 'F3', 'నారప్ప' సినిమాతో వెంకటేష్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు మూడు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. వినూత్న కథాంశంతో ఉన్న సినిమాల్లో నటించేందుకు వెంకీ చాలా ఆసక్తి చూపిస్తారు.
Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?
Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?
Priyanka Chopra: బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయాను, అందుకే దూరమయ్యా: ప్రియాంక చోప్రా
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!
Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి