Cirkus Song Sun Zara: బాలీవుడ్‌కు దేవి శ్రీ ప్రసాద్ - ‘సర్కస్’లో ‘సున్ జరా’ సాంగ్‌తో రచ్చ!
బాలీవుడ్ స్టార్ హారో రణవీర్ సింగ్ తాజాగా నటించిన సినిమా ‘సర్కస్’. ఇటీవల సినిమాలోని ‘సన్ జరా’ అనే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా నటించిన సినిమా ‘సర్కస్’. ఈ సినిమాను బాలీవుడ్ కమర్షయల్ హిట్ లకు కేరాఫ్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూడున్నర నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్, స్టార్ట్ టు ఎండ్ నవ్వించింది. రణవీర్ సింగ్‌కు కరెంట్ తగిలినా షాక్ కొట్టదు అనే ఫాంటసీ ఎలిమెంట్ ని తీసుకొని నవ్వులు పూయించాడు దర్శకుడు. ట్రైలర్ తర్వాత సినిమాలో ‘కరెంట్ లగా రే’ పాటను విడుదల చేసిన మూవీ టీమ్ తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల సినిమాలోని ‘సున్ జరా’ అనే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఈ 'సున్ జరా' పాట ఆకట్టుకునేలా ఉండటంతో రణవీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పాటలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే తో రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించారు రణవీర్ సింగ్. సాంగ్ మొత్తం రొమాంటిక్ అండ్ మెలోడియస్ గా అనిపిస్తుంది. లొకేషన్స్ తో పాటు వారి కాస్టూమ్స్ కూడా 90's స్టైల్ లో ఆకట్టుకునేలా ఉన్నాయి. జాక్వెలిన్ రెడ్ టాప్, బ్రౌన్ స్కర్ట్‌లో కనిపించగా, పూజా హెగ్డే తేయాకు తోటలో పసుపు రంగు చీరలో రణవీర్ తో రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపిస్తోంది. ఇక రణవీర్ సింగ్ బ్రౌన్ బెల్ బాటమ్ ప్యాంట్ తో కూడిన కోటు, ఎరుపు రంగు స్వెటర్ ధరించి కూల్ గా కనిపించారు. మొత్తంగా సాంగ్ లో కాస్టూమ్స్, లొకేషన్స్, డాన్స్, మ్యూజిక్ అన్ని ఆకట్టుకునేలా ఉండటంతో ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ సాంగ్ ను పాపోన్, శ్రేయా ఘోషల్ పాడగా.. కుమార్ లిరిక్స్ రాశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ ఫుల్ స్వింగ్ ఉన్నారు. సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుతెచ్చకున్న దేవి ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గోల్‌మాల్, సింగం, సూర్యవంశీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించిన దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిర్మాత కూడా ఆయనే. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్, వరుణ్ శర్మ, మురళీ శర్మ, జానీ లీవర్, సంజయ్ మిశ్రా నటిస్తున్నారు. అలాగే దీపికా పదుకునే ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే దీపికా-రణవీర్ లు కలసి చేసిన ‘కరెంట్ లగా రే’ పాటకు మంచి ఆదరణ లభించింది. షేక్స్‌పియర్ నవల 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై పూజా హెగ్డే భారీ గానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తో బాలీవుడ్ పాగా వేయాలని చూస్తోంది బుట్టబొమ్మ. అటు రణ్‌వీర్ చివరి సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ కూడా పెద్దగా ఆడకపోవడంతో ఆయన కూడా ‘సర్కస్’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : గోవిందా నామ్ మేరా రివ్యూ: కియారా అద్వానీ కొత్త ఓటీటీ సినిమా ఎలా ఉంది?