Prithviraj Sukumaran Drank Vodka : 3 రోజులు ఉపవాసం, వోడ్కా తాగి డీహైడ్రేట్ - వీల్‌ఛైర్‌లోనే షూటింగ్‌కు.. పృథ్వీరాజ్ ఎందుకలా చేశాడు?
The Goat Life Shooting Dairies : ఆ సినిమాలో హీరో నటించలేదురా బాబు జీవించేశాడు అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ సినిమా కోసం కొందరు నిజంగా ప్రాణం పెట్టి నటిస్తారు. అలాంటివారిలో పృథ్వీరాజ్ ఒకరు.
Prithviraj Drank Vodka for AaduJeevitham The Goat Life : ది గోట్ లైఫ్. తెలుగులో ఆడు జీవితం. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాధారణ మంచిగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించలేదు.. జీవించాడనే అంటున్నారు. డైరక్టర్ చూపించిన ప్రతి డిటైలింగ్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాకు అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి టాక్ వస్తుంది. అయితే పృథ్వీరాజ్ ఓ రోజు సెట్లో వోడ్కా తాగారంటూ ఆ సినిమాటోగ్రాఫర్ సునీల్ చెప్పారు. దాని తర్వాత అతనిని సెట్లోకి చైర్‌పై మోసుకెళ్లాల్సి వచ్చిందంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అదేంటి సెట్లో మందు తాగడం.. అని అనుకోకండి. దీని వెనుక కథ తెలిస్తే.. పృథ్వీరాజ్ ఎంత డెడికేటెడ్ యాక్టరో మీకు తెలుస్తుంది.
ఒకటి కాదు రెండు.. ఏకంగా 16
పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో పెద్ద స్టార్. హీరోగానూ నటించగలడు.. విలన్ పాత్రల్లోనూ జీవించగలడు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. సలార్ సినిమా ఆయనను మొత్తం ఇండియాలోని సినీ ప్రేక్షకులకు దగ్గర చేసింది. మలయాళం ఇండస్ట్రీని టాప్‌లోకి తీసుకువెళ్లాలని ఉందని.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పృథ్వీ. ఇది ముందు నుంచే తన మైండ్‌లో పెట్టుకున్న పృథ్వీకి వచ్చిన ఆలోచనే ఆడు జీవితం. ఈ సినిమాపై పృథ్వీరాజ్ 16 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం షూటింగ్ స్టార్ చేసి.. ఓ సంవత్సరం పోస్ట్ ప్రొడక్షన్ చేసి.. ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఒక్క సినిమా కోసం ఇంత కష్టాన్ని ఎందుకు పడ్డారో.. సినిమా చూస్తే అర్థమవుతుంది.
పాత్రకోసం జీవించేశాడుగా..
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఓ సినిమాని రోజుల్లో, నెలల్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. కొన్ని క్లాసికల్స్ తీయడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఓ జీవితాన్ని ఆవిష్కరించడానికి దశాబ్ధంన్నరకు పైగా కష్టపడి.. సినిమాను ఆవిష్కరించారు మేకర్స్. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పృథ్వీరాజ్ నటన గురించే. ఆయన నటించలేదు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ KS సునీల్ పృథ్వీరాజ్ నటనకోసం ఎంత దూరమైన వెళ్తారని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
కుర్చీలో తీసుకెళ్లాల్సి వచ్చింది
ఈ సినిమాకోసం పృథ్వీరాజ్ 31కిలోలు తగ్గాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎడారిలో నటించాల్సి ఓ సీన్ కోసం అతను చేసిన రిస్క్ చూస్తే ఏమి మనిషివి స్వామి నువ్వు అనాలనిపిస్తుంది. ''ఓ సీన్ కోసం పృథ్వీరాజ్ మూడురోజులు ఉపవాసం చేశాడు. చివరి రోజు తన శరీరంలో ఉన్న నీటిని కూడా పోగొట్టుకోవడానికి ఆయన 30ML వోడ్కా తీసుకున్నాడు. ఆ సమయంలో అతను పూర్తిగా డీహైడ్రేట్ అయిపోయి.. లేవలేని పరిస్థితిలో ఉండగా.. అతనిని కుర్చీలో కూర్చోబెట్టి.. షూటింగ్ ప్లేస్‌కి తీసుకెళ్లారు.'' అంటూ సునీల్ తెలిపారు. ఆహారంలేని వ్యక్తి దాహాంతో అలమటించేలా కనిపించేందుకు సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో పృథ్వీ ఇలా చేశారని వెల్లడించారు. అతని డెడీకేషనే ఆడియన్స్ అందరినీ.. పృథ్వీ నటించిన పాత్రలో లీనమయ్యేలా చేసింది.
Also Read : బరువు తగ్గడంలో హెల్ప్ చేసే వోట్మీల్ డ్రింక్.. రెండు నెలల్లో 20 కిలోలు తగ్గవచ్చట!