Payal Rajput: మహిళలూ మందు కొడతారు, మేమూ మనుషులమే! - పాయల్ బోల్డ్ కామెంట్స్
హీరోయిన్లు లిక్కర్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసినప్పుడు నెటిజన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ విమర్శలపై పాయల్ బోల్డ్ కామెంట్ చేశారు.
"బికినీ వేస్తే బోల్డ్ అంటారు, సారీ కడితే ఆంటీ అంటారు. ఈ విమర్శలకు అంతు ఉండదు" అని పంజాబీ భామ, 'ఆర్ఎక్స్ 100'తో తెలుగులో పాపులర్ కావడంతో పాటు వరుస అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అంటున్నారు. దీనికి కారణం లిక్కర్ బ్రాండ్ ప్రమోషన్స్!
కథానాయికలు ఈ మధ్య లిక్కర్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల నిధి అగర్వాల్, అనితా హంసానందిని కండోమ్స్‌ను ప్రమోట్ చేస్తూ పోస్టులు చేశారు. వాళ్ళిద్దరినీ సోషల్ మీడియాలో చాలా మంది విమర్శించారు. కాజల్ అగర్వాల్, ఇలియానా, రాయ్ లక్ష్మీ, పాయల్ తదితరులు లిక్కర్ ప్రమోట్ చేయడం వల్ల ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. హీరోలు లిక్కర్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసినప్పుడు మౌనంగా ఉండే జనాలు, హీరోయిన్లు ప్రమోట్ చేసినప్పుడు ట్రోల్ చేస్తున్నారని... లింగ వివక్ష చూపుతున్నారనేది కొందరు అంటున్నారు.
పాయల్ గతంలో ఒక విస్కీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ పోస్ట్ చేశారు. తర్వాత డిలీట్ చేసినా.... అప్పట్లో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇటీవల హీరోయిన్స్ కండోమ్స్, లిక్కర్ ప్రమోట్ చేయడం మీద విమర్శలు వస్తుండటంతో పాయల్ మాట్లాడుతూ "ప్రభుత్వం ఆమోదించిన బ్రాండ్స్ అవి. లీగల్ కూడా! ఇంకొకటి... మహిళలూ మందు కొడతారు, చిల్ అవుతారు. మేమూ మనుషులమే" అని తెలిపారు. విమర్శించే వాళ్ళకు ప్రతిదీ సమస్యగా కనబడుతుందని, వాళ్ళను పట్టించుకోవడం మానేశానని ఆమె చెప్పుకొచ్చారు. మహిళలు అందంగా, ఆకర్షణీయంగా, శక్తివంతంగా ఉన్నారు కాబట్టే బ్రాండ్స్ వాళ్ళను వెతుక్కుంటూ వస్తున్నానని మరో హీరోయిన్ నైనా గంగూలీ పేర్కొన్నారు.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
మహిళలు కండోమ్స్, లిక్కర్ ప్రమోట్ చేయడం కరెక్టా? కాదా? అనే డిస్కషన్ జరుగుతోంది. అటువంటి యాడ్స్ చేసే వాళ్ళకు కొంత మంది హీరోయిన్లు, మహిళలు, మగవాళ్ళ నుంచి మద్దతు లభిస్తోంది. అందులో తప్పేముంది? అని ప్రశ్నిస్తున్నారు. అదీ సంగతి!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.