Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో ఆస్కార్ విన్నర్... విలన్‌గా హాలీవుడ్ నటుడు?
Allu Arjun Atlee Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం హాలీవుడ్ స్టార్‌ను అప్రోచ్ అయినట్లు టాక్.

Allu Arjun Atlee Movie Villain Name: ఎవరు? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో విలన్ ఎవరు? ఇద్దరు హాలీవుడ్ స్టార్లలో ఎవరు బన్నీ సినిమాల్లో నటిస్తారు? ఇప్పుడు ఈ డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది. అందుకు కారణం ఏమిటంటే...
అల్లు అర్జున్ విలన్ ఎవరు?
విల్ స్మిత్ చేస్తారా? డ్వేన్ జాన్సన్?
ఇన్‌స్టాగ్రామ్‌లో విల్ స్మిత్ అకౌంట్ ఫాలో అవుతున్నారు అట్లీ. ఆయన ఒక్కర్నే కాదు... మరొక హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ అకౌంట్‌ను సైతం ఫాలో అవుతున్నారు. దాంతో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
View this post on Instagram
అల్లు అర్జున్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసేది విల్ స్మిత్ అని ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు హిందీ సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'లో ఓ చిన్న అతిథి పాత్రలో ఆయన సందడి చేశారు. పైగా, అల్లు అర్జున్ - అట్లీది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ చేసిన అనుభవం విల్ స్మిత్ సొంతం. అందువల్ల, ఆయన పేరు బలంగా వినబడుతోంది. ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న నటుడు విల్ స్మిత్. ఆయన విలన్ రోల్ చేస్తే హాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున సినిమాకు వచ్చే క్రేజ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పవచ్చు.
View this post on Instagram
అల్లు అర్జున్ సరసన దీపికా పదుకోన్!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ అధినేత కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 800 కోట్ల రూపాయలు అని టాక్. దీపికా పదుకోన్ కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయికలకు చోటు ఉంది. ఆ క్యారెక్టర్లలో ఒక పాత్రకు మృణాల్ ఠాకూర్ కన్ఫర్మ్ అయ్యారని టాక్. మరొక పాత్రకు జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినబడుతున్నాయి.
Also Read: నయనతారకు కొత్త చిక్కులు... లీగల్ నోటీసులు పంపిన 'చంద్రముఖి' నిర్మాతలు... ఎందుకంటే?





















