అన్వేషించండి

Peddi Item Song : హల్లల్లల్లో ఐటమ్ సాంగ్ సింగర్ ఈమెనే - రక్షిత సురేష్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!

Hallallallo Song Singer : పెద్ది ఐటమ్ సాంగ్ హల్లల్లల్లోతో పాటే సింగర్ రక్షిత పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఉత్తరాంధ్ర స్టైల్ గాత్రంతో సాంగ్ అదరగొట్టారు. అసలు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..

Peddi Item Song Hallallallo Singer Rakshitha Suresh Background : పెద్ది ఐటమ్ సాంగ్ హల్లల్లల్లో ప్రస్తుతం అటు సోషల్ మీడియా ఇటు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ రొమాంటిక్ టచ్ లిరిక్స్ అందించగా సింగర్‌గా రక్షిత సురేష్ (Rakshitha Suresh) ఫుల్ జోష్‌తో అదిరిపోయే వాయిస్ అందించారు. ఆమె పేరు వైరల్ అవుతుంగా ఆమె ఎవరా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు రక్షిత ఇంతకు ముందు ఏయే పాటలు, ఎన్ని భాషల్లో పాడారు. అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనేది ఓసారి చూస్తే...

మ్యూజిక్‌పై ఇంట్రెస్ట్‌తో...

మైసూరుకు చెందిన రక్షిత చిన్నప్పటి నుంచే మ్యూజిక్‌పై ఇంట్రెస్ట్‌తో ట్రైనింగ్ తీసుకున్నారు. కర్ణాటక మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్‌తో పాటు లైట్ మ్యూజిక్‌లోనూ శిక్షణ పొందారు. కన్నడలో 'రిథమ్ తథీమ్', 'లిటిల్ స్టార్ సింగర్ - 2009' వంటి రియాలిటీ షోల్లో విన్నర్‌గా నిలిచారు. ఆ తర్వాత తమిళ రియాలిటీ షో సూపర్ సింగర్ 6లో ఫస్ట్ రన్నర్‌గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాటలు పాడారు.

తెలుగు పాటతో...

తెలుగు పాటతోనే రక్షిత సింగర్‌గా పరిచయమయ్యారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఆమెను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం (2015)లోని 'చల్లగాలి తాకుతున్నది మేఘమైనది మనసిలా' అనే గీతంతో ఫస్ట్ ప్రయత్నంలోనే ఆడియన్స్ మనసు దోచేశారు. 'లవ్ స్టోరీ'లో ముత్యాల చెమ్మ చెక్క పాట, పలు డబ్బింగ్ సినిమాల్లోనూ పాటలు పాడారు.

జవాన్‌లోని 'నాట్ రామయ్యా వస్తావయ్యా', ది లెజెండ్‌లోని 'తొలి తొలి ఆశల ఊసులే' పాటలు ఆలపించారు. జీవీ ప్రకాశ్ కుమార్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్లతోనూ వర్క్ చేశారు. తన మధుర గాత్రంతో ఎన్నో వేదికలపై పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు.

Also Read : జన నాయగన్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్... సీఎం బర్త్ డేకు డబుల్ ట్రీట్

హల్లల్లల్లో సాంగ్ అలా...

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ టీంలో రక్షిత మెయిన్ సింగర్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన మూవీస్‌లో ఎక్కువ పాటలు పాడారు రక్షిత. మిమీ, లైఫ్ ఆఫ్ ముత్తు, కోబ్రా, పొన్నియన్ సెల్వన్ 1, 2, మామన్నన్, ఆడు జీవితం, థగ్ లైఫ్ చిత్రాల్లో పాటలు పాడారు.

అలా పెద్దిలో హల్లల్లల్లో (Hallallallo Item Song) సాంగ్ పాడే ఛాన్స్ అందుకున్నారు. పూర్తి ఉత్తరాంధ్ర యాసలో తనదైన గాత్రంతో అదరగొట్టారు. ప్రస్తుతం పాటతో పాటు రక్షిత పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగుతోంది.

Also Read : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Taj Story OTT : మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chandini Chowdary : నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Ramayana Release Date : విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget