Hellallallo Song Telugu Lyrics : ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్
Hellallallo Song Lyrics : రామ్ చరణ్ పెద్దిలో ఐటెం సాంగ్ హల్లల్లల్లో సాంగ్ ట్రెండ్ అవుతోంది. రొమాంటిక్ టచ్ ఉన్న లిరిక్స్‌తో పాటు ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి.

Ram Charan's Peddi Hellallallo Song Telugu Lyrics : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుంచి ఐటెం సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. చరణ్‌తో పాటు శ్రుతి హాసన్ జాన్వీ కపూర్ ఎనర్జిటిక్ స్టెప్స్ జోష్ పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ మించి ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వేరే లెవల్. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా... రక్షిత సురేశ్ పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రొమాంటిక్ టచ్ ఉండేలా ఉన్న ఐటెం సాంగ్ లిరిక్స్ ఓసారి చూస్తే...
పల్లవి
బారులుంటాయ్ బంకులుంటాయ్ బంగారాలుంటాయ్...
బాధలుంటాయ్.. బాకీలుంటాయ్... భారాలుంటుంటాయ్...
మనిషన్నవోడికివి మామూలే... ప్రతిపూట తప్పని పేచీలే...
అడపాదడపా ఇడిసెయ్ గడపా... ఏటి పీపీలయిపోతావ్ అతిగా...
వారానికి వెయ్యి... నాకోసం దాయి... నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి...
అరకాసులు తియ్యి... అరవంకీలేయి... స్వర్గానికి దారి చూపిత్తాం వచ్చేయి...
అందం బిందులున్నాయ్ దా దా దా... ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా...
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో...
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...
బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో...
చరణం 1
ఇంట్లో వంటే తింటుంటావా...
హోటల్‌కో దాబాకో ఓసారెల్లిముద్ద మింగి రావా...
హే ఇంట్లో తానం సాలంటావా...
పండక్కో పబ్బంకో ఏట్లోకెళ్లో మునక మనిగి రావా...
ఇది కూడా అంతేరో... ప్రతివారం సంతేరో...
అది కూడా వగ్గేత్తే పుట్టిందింకెందుకురో...
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో...
చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలో..
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో...
చరణం 2
నెమరేసుకోనాకైనా... వివరీసు లేకుంటే ఎల్గా... ఎల్గా...
ఎనకూళ్లోఅననాకైనా వేశాలేవీ లేకుంటే ఎల్గా... అల్గా...
సుఖమిట్టా పోగెసెయ్... ఇప్పుడే అది ఎనకేసెయ్...
ముసలాడైపోయాక మురిపెంగా నెమరేసెయ్...
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో...
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...
బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో...
వారానికి వెయ్యి... నాకోసం దాయి...
నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి...
అరకాసులు తియ్యి... అరవంకీలేయి...
స్వర్గానికి దారి చూపిత్తాం వచ్చేయి...
అందం బిందులున్నాయ్ దా దా దా...
ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా...
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు






















