అన్వేషించండి

Save The Tigers Series season 3 : సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Save The Tigers 3 OTT : ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 3 స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈసారి సూపర్ ఫన్, బిగ్ సర్ప్రైజ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Save The Tigers Web Series Season 3 OTT : పెళ్లైన ముగ్గురు యువకుల కష్టాలు... భార్యల ప్రవర్తనతో విసుగు చెందిన భర్తలు... వైవాహిక జీవితంలో ఏర్పడే సంఘర్షణలు... కామెడీ పంచులతో ఆడియన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్' (Save The Tigers). సీజన్ 1, 2 సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'జియో హాట్ స్టార్' అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఫస్ట్ రెండు సీజన్లలో కామెడీ, ఫన్, క్రేజీ డైలాగ్స్, రిలేషన్ షిప్ డ్రామాతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసిన ఈ సిరీస్ మూడో సీజన్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. 2023లో వచ్చిన ఫస్ట్ సీజన్ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. కొత్త సీజన్‌కు శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహిస్తుండగా... మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం షో ర‌న్న‌ర్స్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజ‌న్ మ‌రింత అస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు, న్యూ రోల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. 

కాస్మిక్ ట్విస్ట్

తాజాగా రిలీజ్ చేసిన ‘సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3’ పోస్టర్ చూస్తుంటే స్టోరీలో ఇంట్రెస్టింగ్ కాస్మిక్ ట్విస్ట్ ఉండ‌బోతుంద‌నే విష‌యం అర్థమవుతోంది. రెండు వైవిధ్య‌మైన ప్ర‌పంచాల మ‌ధ్య జ‌రిగే ప్ర‌త్యేక‌మైన సోష‌ల్ ఎక్స్‌పెరిమెంట్ క‌థ‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చ‌నుంది. ఈ అంశం మొత్తం క‌థ‌ను స‌రికొత్త పంథాలో ప్రేక్ష‌కుల‌ను అందించ‌నుంది. 

మూడు జంట‌లు.. భార్యల వల్ల భ‌ర్త‌లు ప‌డే ఇబ్బందులు.. వారి చుట్టూ తిరిగే కామెడీ డ్రామాకు కాస్మిక్ ట్విస్ట్ అనేది ఎగ్జ‌ైటింగ్ కాన్సెప్ట్‌గా మారింది. ఇది క‌థ‌ను స‌రికొత్త విధానం చూపించ‌టంతో పాటు సమాజంపై అర్థవంతమైన వ్యాఖ్యానానికి కూడా అవకాశం దక్కనుంది. 

Also Read : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్

సీజన్ 3లో సర్‌ప్రైజింగ్ రోల్

ఫస్ట్ రెండు సీజన్లలో ఆడియన్స్ మనసులు గెలుచుకున్న‌ ప్రియ‌ద‌ర్శి - జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌ - దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం - పావ‌ని గంగిరెడ్డి జంట‌లు సీజన్ 3లోనూ అల‌రించ‌నున్నారు. ఇక ఈ సీజ‌న్‌3లో అందరికీ పెద్ద సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీతో న‌వ్వించ‌బోతున్నారు.

పోస్ట‌ర్ చూస్తుంటే ఆయ‌న పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. వెన్నెల కిషోర్ పాత్ర క‌థ‌లో అనూహ్య‌మైన మ‌లుపులు తీసుకురావ‌ట‌మే కాకుండా, అద్భుత‌మైన కామెడీ టైమింగ్‌తో పాటు గుర్తుండిపోయేలా డ్రామ‌టిక్ పెర్ఫామెన్స్‌తో సిరీస్‌ను మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా మార్చ‌బోతున్నార‌ని అభిమానులు భావిస్తున్నారు. అతి పెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'సేవ్ ది టైగర్స్ - సీజన్ 3' త్వరలో జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు

న‌టీన‌టులు : ప‌్రియ‌ద‌ర్శి - జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌- దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం - పావ‌ని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు.

టెక్నికల్ టీం : షో రన్నర్స్ - మ‌హి వి.రాఘ‌వ్‌, ప్రదీప్ అద్వైతం, ద‌ర్శ‌క‌త్వం - శ్రీరామ్ ఎర‌గం, నిర్మాత‌లు - శివ మేక‌, సాహితి చింత‌ల‌పూడి, 
సినిమాటోగ్ర‌ఫీ - విశ్వేశ్వ‌ర్ శిల‌కోటి, మ్యూజిక్ - అజ‌య్ అర‌సాడ‌, ర‌చ‌న‌ - విజ‌య్ న‌మోజు, డిఎస్ గౌత‌మ్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget