Chandini Chowdary : నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Chandini Chowdary Allegations : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, హీరోయిన్ల భద్రత అంశంపై టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్‌గా మారాయి.

Actress Chandini Chowdary Casting Couch Allegations In Film Industry : సినీ ఇండస్ట్రీలో మళ్లీ కాస్టింగ్ కౌచ్ రగడ మొదలైంది. నిన్న ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్... కమిట్మెంట్ లేనిదే ఇండస్ట్రీలో అవకాశాలు రావంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా హీరోయిన్ చాందిని చౌదరి... కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల భద్రత, క్యాస్టింగ్ కౌచ్ అంశంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఛాన్స్ ఇస్తానని...
'ఛాయ్ బిస్కెట్' నిర్వహించిన 'ది ఆడిషన్ షో' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు. 2015లో మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ టైంలో ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం ఇస్తామంటూ ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడని చాందిని తెలిపారు. సెట్‌లో తన తల్లి సమక్షంలోనే మాట్లాడిన ఆ వ్యక్తి... ఆ తర్వాత ఫోన్ చేసి 'నువ్వు చూడటానికి అంత బాగుండవు. రంగు కూడా లేవు.. నిన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టాలంటే కన్విన్స్ చేయాలని అన్నాడు.' అని చెప్పారు.
కొద్ది రోజుల తర్వాత తనకే ఫోన్ చేసి 'నీ కమిట్మెంట్ ఏంటో నేను చూస్తాను' అంటూ పరోక్షంగా లైంగిక వేధింపులకు దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు చాందిని. తాను దానికి ఒప్పుకోకపోవడంతో తన అమ్మకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు గుర్తు చేసుకున్నారు. తన తల్లి ఆగ్రహంతో... 'నువ్వు ఆర్టిస్టుల కోసం చూస్తున్నావా? లేక బ్రోకర్ పనులు చేస్తున్నావా? మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు పట్టిస్తాం.' అని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. దీని తర్వాత సదరు వ్యక్తి ఇండస్ట్రీలో తనపై దుష్ప్రచారం చేశాడని చెప్పారు. నాకు పొగరని, వర్క్ చేయడం కష్టమని ప్రచారం చేసినట్లు వెల్లడించారు. ఆ నెగిటివ్ ముద్ర నాపై ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని ఆవేదన చెందారు.
Also Read : Varanasi : వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
'ఆయన ముఖం మాడిపోయింది'
అడ్డదారుల్లో అవకాశాలు పొంది ఈజీగా ఉండడం కంటే డిఫికల్ట్‌గా ఉండడమే మంచిదని చాందిని దీటుగా బదులిచ్చారు. 2024లో 'గామి', 'ఏవం', 'మ్యూజిక్ షాప్ మూర్తి' మూవీస్ ప్రమోషన్ల సమయంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు, ఒక స్టైలిస్ట్ ద్వారా ఓ ప్రొడ్యూసర్ తన వద్దకు వచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఆ ప్రొడ్యూసర్ 'మనం 2015లో ఒక జ్యువెలరీ యాడ్ కోసం మాట్లాడాం.' అని గుర్తు చేయగానే… చాందిని వెంటనే స్పందిస్తూ 'ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!' అని ఆయన ముఖం మీదే నేరుగా నిలదీశానని చెప్పారు. ఆ మాట వినగానే ఆయన ముఖం మాడిపోయిందని తెలిపారు. మొదట్లో తాను చాలా సాఫ్ట్‌గా ఉండేదాన్నని, కానీ పరిశ్రమలో ఎదురైన ఇలాంటి సంఘటనల వల్లనే తన రక్షణ కోసం ‘డిఫెన్స్ మెకానిజం’గా ఈ రకమైన కఠిన వైఖరిని అలవర్చుకున్నానని చాందిని స్పష్టం చేశారు. తేడాగా ప్రవర్తిస్తే అసలు స్కోప్ ఇవ్వనని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం చాందిని కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Ramayana Release Date : విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు























