Allu Aravind: ఎవరీ కోడి రామ్మూర్తి నాయుడు? 'తండేల్' సక్సెస్ తర్వాత మరో ఉత్తరాంధ్ర కథపై కన్నేసిన అల్లు అరవింద్
Allu Aravind : 'తండేల్' మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ కోడీ రామ్మూర్తి నాయుడు బయోపిక్ ను సినిమాగా లేదా సిరీస్ గా తీయాలనే ఆకాంక్షను వెల్లడించారు. మరి కోడి రామ్మూర్తి ఎవరో తెలుసా ?

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) తాజాగా మల్ల యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా సినిమా గానీ, లేదంటే వెబ్ సిరీస్ గానీ చేయాలని కోరుకుంటున్నట్టు తాజాగా వెల్లడించారు. శాకాహారి అయినప్పటికీ ఆయన శారీరక దారుఢ్యంలో ఎందరికో స్పూర్తి అని కొనియాడారు అల్లు అరవింద్. ఆయన జీవిత చరిత్రను వెబ్ సిరీస్ గా తీయాలని ఆలోచనతో కొంతవరకు ఇప్పటికే స్టడీ చేసామని వెల్లడించారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో అల్లు అరవింద్ ఈ కామెంట్స్ చేశారు. నిజానికి చాలా కాలం నుంచి టాలీవుడ్ లో కోడి రామ్మూర్తి బయోపిక్ గురించి చర్చ నడుస్తోంది. గతంలోనూ టాలీవుడ్ హల్క్ రానా కోడి రామ్మూర్తి బయోపిక్ లో నటించాలని ఉందని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి టాలీవుడ్ ప్రముఖులంతా తెరపైకి తీసుకురావాలని ఇంతగా ఉవ్విళ్లూరుతున్న ఆ కోడి రామ్మూర్తి ఎవరు? అనే విషయాన్ని తెలుసుకుందాం.
కోడి రామ్మూర్తి ఎవరు ?
గతంలో ఓ సారి రానా విజయనగరానికి చెందిన ప్రముఖ మల్ల యూధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ గురించి ప్రస్తావించడంతో ఈ చర్చ మొదలైంది. 'కలియుగ భీముడు'గా పేరు ప్రఖ్యాతలను సంపాదించిన ఆయన గురించి వింటూ తాను పెరిగానని, ఆయన పాత్రలో నటించాలని ఉందని రానా చెప్పుకొచ్చారు. బయోపిక్ లా ట్రెండ్ జోరుగా నడుస్తున్న టైంలోనే కోడి రామ్మూర్తి బయోపిక్ ని తెరపైకి తీసుకురావాలని ఆలోచించారు. కానీ ఇప్పటిదాకా ఈ ఆలోచన పట్టాలెక్కలేదు.
ఇక కోడి రామ్మూర్తి అంటే ఈతరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ నిన్నటి జనరేషన్ వరకు ఆయన ఒక బ్రాండ్ లాంటివారు. కుస్తీ పోటీలలో ఎదుటి వారిని గడగడలాడించి, చిత్తుచిత్తు చేసిన మల్లయోధుడే కోడి రామ్మూర్తి. కోడి రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లా వీర ఘట్టంలో 1882లో జన్మించారు. అప్పట్లో కోడి రామ్మూర్తి సర్కస్ కంపెనీ పెట్టి, చేసే విన్యాసాలను చూడడానికి జనాలు తండోపతండాలుగా తరలి వచ్చేవారట. ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకుని, కండలు బిగించి, ఛాతికి చుట్టిన ఉక్కు తాళ్లను సైతం తెంచేవారని కథలుగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఛాతీ మీద ఏకంగా ఏనుగులను ఎక్కించుకొని ఐదు నిమిషాల పాటు నిలిపిన ఘనుడు అనే పేరు ఉంది కోడి రామ్మూర్తికి. ఇక రెండు కార్లకు కట్టిన తాళ్లను రెండు చేతులతో పట్టుకొని, వాటిని కదలకుండా ఆపేవారట. రైలింజన్ ను కూడా ఆపిన ఈ ఘనుడు 21 సంవత్సరాల వయసులోనే 1.5 టన్నుల భారాన్ని తన గుండెల పై మోసాడని అంటారు. ఇక్కడితో అయిపోలేదు ఆయన స్టోరీ.
Also Read: లైలా మూవీ రివ్యూ: లేడీ గెటప్ వేస్తే చాలా? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా?
కోడి రామ్మూర్తి సాహసాలకు లండన్ క్వీన్ ఫిదా
కోడి రామ్మూర్తి ఆ రోజుల్లోనే లండన్ కి వెళ్లి అక్కడ బంకింగ్ హామ్ ప్యాలెస్ లో కూడా కుస్తీ పోటీలో సత్తా చాటుకున్నారు. దీంతో బ్రిటిష్ రాణి ఆయన గుండె ధైర్యానికి ఫిదా అయ్యి, 'ఇండియన్ హెర్కులస్' అనే బిరుదు కూడా ఇచ్చింది. ఈ రకంగా తెలుగు వారికి గర్వకారణమైన కోడి రామ్మూర్తి జీవిత కథను సినిమాగా తీయాలని అప్పుడు రానా, ఇప్పుడు అల్లు అరవింద్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుటి దాకా ఆయనకి ఇండియన్ హెర్కులస్, కలియుగ భీముడు, మల్ల మార్తాండ, జయ వీర హనుమాన్, వీర కంఠీరవ వంటి బిరుదులు కూడా వచ్చాయి. 20వ దశాబ్దపు తొలి నాళ్లలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగువారిలో అగ్రగణ్యుడుగా నిలిచారు కోడి రామ్మూర్తి నాయుడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

