What The Fish First Look: మంచు మనోజ్ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ఆకట్టుకుంటున్న సూపర్ థ్రిల్లింగ్ ‘వాట్ ది ఫిష్’ ఫస్ట్ లుక్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ‘వాట్ ది ఫిష్’ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల అయ్యింది. సరికొత్తగా రూపొందిన ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ వెండి తెరకు దూరమై చాలా రోజులు అవుతోంది. అడపా దడపా సినిమాలు చేసే మనోజ్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల కారణంగా అసలే సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య తన వివాహ జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆయన, తాజా ఓ సినిమా చేస్తున్నారు. ‘వాట్ ది ఫిష్’ పేరుతో తన కొత్త ప్రాజెక్ట్ గతంలోనే ప్రకటించారు. ఈ చిత్రానికి వరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న ‘వాట్ ది ఫిష్’ ఫస్ట్ లుక్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. మనోజ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో మనోజ్ ఆకట్టుకుంటున్నారు. టెక్నో ఫాంటసీ మూవీగా రూపొందుతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. రోబో మాదిరిగా కనిపిస్తూ మనోజ్ మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఫస్ట్ లుక్ అదరగొట్టింది. ఈ సినిమాలో మనోజ్ సరికొత్త గెటప్ లో అలరిస్తున్నారు. అంతేకాదు, ‘మనం మనం బరంపురం’ అనే ట్యాగ్ లైన్ క్యాచీగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో మనోజ్ మళ్లీ ఆయన సక్సెస్ బాట పట్టడం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు.
థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ‘వాట్ ది ఫిష్’
‘వాట్ ది ఫిష్’ చిత్రం డార్క్ కామెడీ, హై-ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. ఈ సినిమాతో మనోజ్ ప్రేక్షకుల హృదయాలను చూరగొంటారని ఇప్పటికే దర్శకుడు వరుణ్ వెల్లడించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నిం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సైతం టొరంటో, కెనడాలోని పలు ప్రాంతాల్లో జరిపినట్లు తెలుస్తోంది. ‘వాట్ ది ఫిష్’ సినిమాకు టాలెంటెడ్ టాలీవుడ్ నటులతో పాటు ప్రఖ్యాత టెక్నికల్ సిబ్బంది పని చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బహుభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ చిత్రాన్ని 6ix సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Also Read : బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు భారీగా డిమాండ్ చేసిన తమన్నా - క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ
వైవాహిక జీవితంలో రెండో ఇన్నింగ్స్
ఈ మధ్యే మంచు మనోజ్, నాగ మౌనిక రెడ్డి మెడలో మూడు ముడులు వేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో కన్నుల పండుగగా పెళ్లి జరిగింది. మౌనిక కంటే ముందు లక్ష్మీ ప్రణతిని ప్రేమ వివాహం చేసుకున్నారు మనోజ్. కొన్ని రోజులకు విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో భూమా నాగ మౌనికా రెడ్డి మొదటి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ధీరవ్ రెడ్డి. ఇప్పుడు ఆ బాబు బాధ్యతను కూడా మనోజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : హిందీలో 'మల్లేశం' దర్శకుడు తీసిన '8 ఎఎం మెట్రో' సినిమా రివ్యూ... మంచి ఫిల్టర్ కాఫీ తాగిన అనుభూతి