అన్వేషించండి

Goat 3rd Single: దళపతి విజయ్ కోసం యువన్ శంకర్ రాజా మార్క్ 'స్పార్క్' - మూడో సాంగ్ వచ్చేసిందోచ్

Vijay Goat's Spark Song: దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న 'The GOAT' సినిమాలో మూడో పాట 'స్పార్క్'ను ఇవాళ విడుదల చేశారు. అది ఎలా ఉందో వినండి, లిరికల్ వీడియో చూడండి.

కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'ది గోట్'. The GOAT అంటే... ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మీనింగ్. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడో సాంగ్ వచ్చింది. 

తమిళంలో విడుదలైన గంటకు తెలుగులో!
విజయ్ కోసం యువన్ శంకర్ రాజా తనదైన మార్క్ బాణీలో 'స్పార్క్' సాంగ్ కంపోజ్ చేశారు. ఈ పాటను సంగీత దర్శకుడు యువన్ స్వయంగా ఆలపించడం విశేషం. ఈ సాంగ్ తమిళ్ వెర్షన్ ఆరు గంటలకు విడుదల అయ్యింది. తెలుగు పాటను 7 గంటలకు విడుదల చేశారు. 

'ది గోట్'లో మూడో పాట 'స్పార్క్'కు తెలుగులో 'సరస్వతీ పుత్ర' రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. వృష బాలుతో కలిసి యువన్ శంకర్ రాజా పాడారు. ఇది ఇన్స్టంట్ హిట్ అయ్యింది. 

'ది గోట్' సినిమాను ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకం మీద కల్పాత్తి ఎస్ అఘోరమ్, కల్పాత్తి ఎస్ గణేష్, కల్పాత్తి ఎస్ సురేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (The Goat Telugu Release) ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read: దేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్

The Goat Songs: 'ది గోట్' నుంచి ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ 'విజిలేస్కో', రెండో సాంగ్ 'నిన్ను కన్న కనులే'... రెండిటికీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందని ఫిల్మ్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. సాంగ్స్ హిట్ అవుతుండటం, విజయ్ రాజకీయాల్లోకి వెళుతుండటంతో లాస్ట్ సినిమా ఇదేననే ప్రచారం 'ది గోట్' మీద మరింత అంచనాలు పెంచుతోంది.

Also Readపిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు


Vijay dual role in The Goat: 'ది గోట్' సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఆయన సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయిక. ఇంకా ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ ఇతర ప్రధాన తారాగణం.

Also Readతిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget