Anurag Kulkarni: అనురాగ్ గొంతులో అందమైన అమ్మ పాట - జో జో లాలీ అమ్మ
Kaliyugam Pattanamlo movie songs: యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రం అందమైన అమ్మ పాట వచ్చింది. చిరంజీవి 'విశ్వంభర' దర్శకుడు వశిష్ఠ విడుదల చేశారు.
Anurag Kulkarni lent his voice for beautiful mother song in Kaliyugam Pattanamlo: అమ్మ... సృష్టికి మూలం. అమ్మ... ఎప్పటికీ వీడిపోని, విడదీయరాని బంధం. అందుకే, సిల్వర్ స్క్రీన్ మీద అమ్మ సెంటిమెంట్, ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ ఫార్ములా. అమ్మ మీద చాలా పాటలు వచ్చాయి. ఇప్పుడు యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి మరో అమ్మ పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'కలియుగం పట్టణంలో' సినిమాలో ఆయన 'జో జో లాలీ పాట పాడారు.
'జో జో లాలీ' విడుదల చేసిన వశిష్ఠ
Chiranjeevi's Vishwambhara director Vassishta launched 'Jo Jo Lali Amma' song from the movie Kaliyugam Pattanamlo: బాలనటుడిగా పలు సినిమాల్లో మెప్పించి కథానాయకుడిగా మారిన విశ్వ కార్తికేయ నటించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. దీనిని నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకాలపై కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంతో రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మార్చి 22న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.
'కలియుగంలో పట్టణంలో' చిత్రాన్ని అనురాగ్ కులకర్ణి పాడిన 'జో జో లాలీ...'ను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'విశ్వంభర' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బ్లాక్ బస్టర్ 'బింబిసార' దర్శకుడు వశిష్ఠ విడుదల చేశారు. సాంగ్ బావుందని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పాటను భాస్కరభట్ల రవి కుమార్ రాశారు. ఈ చిత్రానికి అజయ్ అరసాడా సంగీతం అందించారు.
Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు
'కలియుగం పట్టణంలో' ఇద్దరు హీరోయిన్లు!
ఈ సినిమాలో విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ కథానాయిక. ఆమె కాకుండా మరొక హీరోయిన్ కీలక పాత్ర చేశారని దర్శక నిర్మాతలు చెప్పారు. చిత్రా శుక్లా కథను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తారని తెలిపారు. 'మా అబ్బాయి', 'రంగుల రాట్నం', 'సిల్లీ ఫెలోస్' 'తెల్లవారితే గురువారం' తదితర సినిమాల్లో ఆమె నటించారు. 'కలియుగం పట్టణంలో' సినిమా చిత్రీకరణ అంతా కడప జిల్లాలో చేశామని, 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశామని దర్శక నిర్మాతలు చెప్పారు.
Also Read: థియేటర్లలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలుగు సినిమాలు ఇవే!
విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా నటించిన ఈ సినిమాలో దేవి ప్రసాద్, చిత్రా శుక్లా ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: గ్యారీ బీహెచ్, పాటలు: చంద్రబోస్ - భాస్కర భట్ల రవికుమార్, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని, సంగీత దర్శకుడు : అజయ్ అరసాడ, నిర్మాణ సంస్థలు: నాని మూవీ వర్క్స్ - రామా క్రియేషన్స్, నిర్మాతలు: డాక్టర్ కె. చంద్ర ఓబుల్ రెడ్డి - జి మహేశ్వర రెడ్డి - కాటం రమేష్, దర్శకుడు : రమాకాంత్ రెడ్డి.