Vishnu Manchu: 'కన్నప్ప' మూవీ పైరసీ లింక్స్ - ఆడియన్స్‌కు విష్ణు మంచు రిక్వెస్ట్
Kannappa Movie: 'కన్నప్ప' మూవీ పైరసీకి గురి కావడంపై విష్ణు మంచు ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీని ప్రోత్సహించొద్దని థియేటర్లలోనే మూవీ చూడాలంటూ విజ్ఞప్తి చేశారు.

Vishnu Manchu Reaction On Kannappa Movie Piracy: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' బాక్సాఫీస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ మూవీని సైతం పైరసీ భూతం వెంటాడుతోంది. నెట్టింట అనధికార లింక్స్ ప్రత్యక్షం కాగా మూవీ టీం వాటిని తొలగించే పనిలో పడింది. తాజాగా ఈ అంశంపై విష్ణు రియాక్ట్ అయ్యారు.
ఆడియన్స్‌కు రిక్వెస్ట్
'కన్నప్ప' మూవీ పైరసీకి గురి కావడంపై విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను థియేటర్లలోనే చూడాలని... పైరసీని ఎంకరేజ్ చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. 'కన్నప్ప సినిమా పైరసీకి గురైంది. ఇప్పటికే మా టీం నెట్టింట ఉన్న దాదాపు 30 వేల అనధికార లింక్స్‌ను డిలీట్ చేసింది. ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది. పైరసీ అంటే దొంగతనంతో సమానం. మన పిల్లలకు మనం దొంగతనం చేయమని నేర్పించం కదా... ఇలా అన్ అఫీషియల్‌గా సినిమా చూడడం కూడా దొంగతనంతో సమానమే. సరైన మార్గంలో మా 'కన్నప్ప' మూవీని ఆదరించండి.' అంటూ 'X'లో పోస్ట్ పెట్టారు.
Dear movie lovers,#Kannappa is under attack from piracy. Over 30,000 illegal links have already been taken down. This is heartbreaking.
— Vishnu Manchu (@iVishnuManchu) June 30, 2025
Piracy is theft — plain and simple. We don’t teach our children to steal. Watching pirated content is no different.
Please don’t encourage…
Also Read: నితిన్ 'తమ్ముడు' To హాలీవుడ్ జురాసిక్ వరల్డ్ - ఈ వారం మూవీస్, ఓటీటీల్లో వెబ్ సిరీస్ లిస్ట్ పెద్దదే!
రికార్డు కలెక్షన్స్
ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కన్నప్ప' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. విష్ణు మంచు కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఇండియా వ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.23.75 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే రూ.9.35 కోట్లు, రెండో రోజు రూ.7 కోట్లకు పైగా, మూడో రోజు రూ.7.25 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ మూవీని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించగా... తిన్నడిగా విష్ణు, ఆయన సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు, కిరాతగా మోహన్ లాల్, రుద్రుడిగా ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, శివ బాలాజీ, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
విష్ణు నెక్స్ట్ మూవీ ఆయనతోనేనా...
'కన్నప్ప' హిట్ కావడంతో విష్ణు తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనే దానిపై ఇప్పుడు హైప్ నెలకొంది. ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా భారీ స్థాయిలో ఈ సినిమా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.





















