Vishal Sai Dhanshika: పదిహేనేళ్లుగా స్నేహం... ఇప్పుడు ప్రేమ... సాయి ధన్సికతో విశాల్ పెళ్లి - షాక్ ఇచ్చిన కొత్త ప్రేమ జంట
Vishal - Sai Dhanshika Wedding Date: హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తామిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని అనౌన్స్ చేశారు.

తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు... ఇటు టాలీవుడ్, అటు ఇండియన్ సినిమా ఆడియన్స్ అందరికీ కోలీవుడ్ హీరో విశాల్ షాక్ ఇచ్చారు. హీరోయిన్ సాయి ధన్సికతో తాను ప్రేమలో ఉన్నట్టు అనౌన్స్ అంతే కాదు... త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అటు సాయి ధన్సిక కూడా విశాల్‌ను 'బేబీ' అనే స్టేజి మీద పిలిచారు. దాంతో షాక్ అవ్వడం ఆడియన్స్ వంతు అయ్యింది.
మార్నింగ్ న్యూస్ లీక్...
సాయంత్రం పెళ్లి అనౌన్స్!
విశాల్, సాయి ధన్సిక ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోమవారం (మే 19) ఉదయం న్యూస్ లీక్ అయింది. అదే రోజు సాయంత్రం నడిగర్ (నటీనటుల) సంఘం బిల్డింగ్ ఓపెనింగ్ జరిగింది. ఆ సంఘానికి విశాల్ కార్యదర్శి. ఆ ప్రారంభోత్సవంలో తమ పెళ్లి గురించి హీరో హీరోయిన్లు ఇద్దరూ అనౌన్స్ చేశారు.
Also Read: కమల్‌ను చూసి చిరు, బాలయ్య నేర్చుకోవాలా? 'థగ్ లైఫ్'లో ఆ ముద్దులేంటి? రొమాన్స్ ఏంటి?
— Moorthy (@Moorthy1796707) May 19, 2025
ఆగస్టు 29న ఏడడుగులు...
ఆగస్టు 29న తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు విశాల్, సాయి ధన్సిక తెలిపారు. తనకు 15 ఏళ్లుగా విశాల్ పరిచయం అని, ఒక సమస్య వచ్చినప్పుడు తన ఇంటికి వచ్చాడని, అప్పటి నుంచి స్నేహితులుగా ఉంటున్నామని, ఇటీవల తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్లు సాయి ధన్సిక తెలిపారు మరోవైపు విశాల్ కూడా తమ ప్రేమ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలో కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read: సుప్రీతా నాయుడుకు మరో సినిమా ఛాన్స్... 'అమరావతికి ఆహ్వానం'లో సురేఖ వాణి కుమార్తె
#Vishal announced that he is going to Marry #SaiDhanshika 💍
— AmuthaBharathi (@CinemaWithAB) May 19, 2025
"She is a wonderful person. God saved the best at the last. We are going to lead a lovely life. I will make sure she will act after marriage also♥️✨"pic.twitter.com/h0VjFG8OMk
#SaiDhanshika:
— AmuthaBharathi (@CinemaWithAB) May 19, 2025
"Enna Baby Solliralama😀❓. Me & #Vishal going to marry on Aug 29th. We recently started talking with each other & got into love. I just want Vishal to be happy & I love you🫶"pic.twitter.com/F1j8bw3XA5





















