అన్వేషించండి

Vishal: షాక్ ఇచ్చిన విశాల్ - రాజకీయాలపై కీలక ప్రకటన

Vishal on politics: కోలీవుడ్ యంగ్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన విశాల్ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు.

కోలీవుడ్ కథానాయకుడు, తెలుగు వాడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు విశాల్ (Vishal) రాజకీయాల్లోకి వస్తున్నట్లు రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించిన తర్వాత విశాల్ రాజకీయ పార్టీ ప్రకటన రావడంతో ఆయనకు పోటీగా వస్తున్నారని ఊహాగానాలు మొదలు అయ్యాయి. ఈ ప్రచారం మీద విశాల్ స్పందించారు. 

రాజకీయాల్లోకి రావడం లేదు!
తాను రాజకీయాల్లోకి రావడం లేదని విశాల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. రాజాకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని అందులో పేర్కొన్నారు. మెరుగైన సమాజం ఏర్పాటుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Also Read'కెజియఫ్' రూటులో పుష్పరాజ్ - ఐకాన్ స్టార్ తగ్గేది లే

View this post on Instagram
 
A post shared by Vishal (@actorvishalofficial)

రాజకీయాలు విశాల్ (Vishal Politics)కు కొత్త కాదు. నడిగర్ సంఘం ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆయన ప్యానల్ తరఫున పోటీ చేసిన నాజర్ ప్రెసిడెంట్ అయ్యారు. విశాల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలు సైతం ఆయనకు కొత్త కాదు. తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. అది తిరస్కరణకు గురి కావడంఅప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. అందువల్ల, విశాల్ రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం నిజమని చాలా మంది నమ్మారు. దళపతి విజయ్ పార్టీకి పోటీగా రాజకీయాల్లోకి విశాల్ వస్తున్నారా? అని తమిళ సినిమా ఇండస్ట్రీలో చర్చ మొదలైందని తెలుస్తోంది.

Also Readప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్'... మాసోడి సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

తమిళ హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా కొన్నేళ్ల పాటు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన ఎంజీఆర్... తర్వాత 'ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం' పార్టీ స్థాపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఒక్కప్పటి కథానాయిక జయలలిత సైతం ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధికి సైతం సినిమా నేపథ్యం ఉంది.

ఎంజీఆర్ తర్వాత తరంలో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన తమిళ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ, ఆయన వెనకడుగు వేశారు. లోక నాయకుడు కమల్ హాసన్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేశారు. రాజకీయ పార్టీ స్థాపించారు. కానీ, అధికారంలోకి మాత్రం రాలేకపోయారు. ఇటీవల కన్ను మూసిన విజయకాంత్ సైతం రాజకీయాల్లోకి ప్రభావం చూపించారు. అధికారంలోకి రాలేదు కానీ తన పార్టీని ఇతర పార్టీల్లో విలీనం చేయకుండా చివరి వరకు ధైర్యంగా నిలబడ్డారు.

Also Readసాయి రాజేష్... సందీప్ రెడ్డి వంగా... 'బేబీ' హిందీ రీమేక్‌... కాన్ఫిడెంట్‌గా ఎస్కేఎన్!

రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి హీరోలతో పోలిస్తే తమిళ యువతీ యువకుల్లో విజయ్ కంటూ బలమైన అభిమానగణం ఉంది. అయితే... వాళ్లలో ఎంత మంది ఓటు వేస్తారు? అనేది చూడాలి. ఎంజీఆర్ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. జయలలిత, కరుణానిధి వంటి బలమైన రాజకీయ ప్రత్యర్థులు కూడా లేరు. ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర రాజకీయ నాయకులకు విజయ్ ఎటువంటి పోటీ ఇస్తారో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Embed widget