Pushpa 3: 'కెజియఫ్' రూటులో పుష్పరాజ్ - ఐకాన్ స్టార్ తగ్గేది లే
Sequel to Pushpa 2: 'పుష్ప'కు సీక్వెల్ 'పుష్ప 2' సెట్స్ మీద ఉంది. ఆ సినిమాతో పుష్పరాజ్ క్యారెక్టర్ ఆగదని, దానికి సీక్వెల్ కూడా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను ఇంటర్నేషనల్ లెవల్‌లో పాపులర్ చేసిన క్యారెక్టర్ పుష్ప. 'తగ్గేదే లే...' అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టుకుని ఆయన చేసిన మేనరిజమ్ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. 'పుష్ప: ది రైజ్' సూపర్ డూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ 'పుష్ప: ది రూల్' (Pushpa The Rule) తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాతో పుష్ప రాజ్ పాత్రకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదని టాక్.
'పుష్ప 2'కు సీక్వెల్... 'పుష్ప 3' కూడా!
'పుష్ప 2' సీక్వెల్ తీయాలని అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డిసైడ్ అయ్యారట. 'పుష్ప: ది రోర్' టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. టైటిల్ ఫిక్స్ చేయలేదు గానీ సీక్వెల్ తీయాలని అనుకుంటున్న మాట నిజమేనని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
'కెజియఫ్' రూటులో 'పుష్ప 2' టీమ్!
Pushpa follows KGF route: 'బాహుబలి'తో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రెండు పార్టులుగా సినిమాను విడుదల చేయడమనే ట్రెండ్ మొదలైంది. ప్రభాస్, రాజమౌళి సినిమా కంటే ముందు కొన్ని సినిమాలు రెండు భాగాలుగా విడుదల అయినప్పటికీ... రెండూ భారీ విజయాలు & వసూళ్లు సాధించడం అగ్ర దర్శక నిర్మాతలకు, హీరోలకు ధైర్యం వచ్చింది.
Also Read: రాజకీయాల్లోకి విశాల్... విజయ్ పార్టీకి పోటీగా నడిగర్ నాయకన్?
సాయి రాజేష్... సందీప్ రెడ్డి వంగా...
— ABP Desam (@ABPDesam) February 7, 2024
'బేబీ' హిందీ రీమేక్... కాన్ఫిడెంట్గా ఎస్కేఎన్!#SandeepVangaReddy #SaiRajesh #baby #BabyHindiRemake #CultBomma @SKNonline https://t.co/xsZpuUC9z6
'బాహుబలి' తర్వాత కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కెజియఫ్' రెండు భాగాలుగా విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఆ రూటులో 'పుష్ప' టీం కూడా వెళుతోంది. 'కెజియఫ్' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా 'సలార్'. అది కూడా రెండు పార్టులుగా విడుదల కానుంది. 'సలార్' 650 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు సీక్వెల్ సెట్స్ మీద ఉంది.
విడుదల తేదీలో మార్పు లేదు!
'పుష్ప 2'లో అల్లు అర్జున్ జోడీగా, శ్రీవల్లి పాత్రలో మరోసారి రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. ఆ మధ్య పుష్ప 2 విడుదల వాయిదా పడొచ్చని వార్తలు వచ్చాయి. అయితే... అందులో నిజం లేదని టీమ్ కన్ఫర్మ్ చేసింది.
Also Read: ప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్'... మాసోడి సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
'పుష్ప 2' సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ సందడి చేయనున్నారు. 'పుష్ప'లో కీలక పాత్రలు చేసిన జగదీశ్, సునీల్, అనసూయ సైతం 'పుష్ప 2'లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: కొత్తగా రవితేజతో 'ఈగల్'లో రొమాన్స్, సీన్స్... కావ్య థాపర్ ఇంటర్వ్యూ