Baby Hindi Remake: సాయి రాజేష్... సందీప్ రెడ్డి వంగా... 'బేబీ' హిందీ రీమేక్... కాన్ఫిడెంట్‌గా ఎస్కేఎన్!
SKN Interview Baby Hindi Remake: 'బేబీ' సినిమాతో నిర్మాత ఎస్కేఎన్ భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ 'బేబీ' ప్రోగ్రెస్ గురించి ఆయన చెప్పిన విశేషాలు...
SKN reveals Baby hindi remake director: తెలుగులో 'బేబీ' ఒక సంచలనం. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించింది. వంద కోట్ల వసూళ్లు సాధించింది. సాయి రాజేష్ (Sai Rajesh) దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. ఈ శనివారం (ఫిబ్రవరి 10న) థియేటర్లలోకి వస్తున్న 'ట్రూ లవర్'ను ఆయన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బేబీ' హిందీ రీమేక్ గురించి మాట్లాడారు.
'బేబీ' హిందీ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. అతి త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఈ మధ్య హిందీలో రీమేక్ అయిన తెలుగు సినిమాలో కొన్ని ఆశించిన విజయాలు సాధించలేదు. 'జెర్సీ'తో గౌతమ్ తిన్ననూరి, 'హిట్'తో శైలేష్ కొలను తెలుగులో విజయాలు అందుకున్నారు. తమ సినిమాలను హిందీలో రీమేక్ చేసి సేమ్ మేజిక్ రిపీట్ చేయలేకపోయారు. 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ ఫ్లాప్ అయ్యింది. ఈ విషయం ఎస్కేఎన్ ముందు ఉంచగా... ''ఒరిజినల్ డైరెక్టర్ 'అల వైకుంఠపురములో' రీమేక్ చేయలేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా సందీప్ రెడ్డి వంగా రీమేక్ చేశారు. అది బ్లాక్ బస్టర్ అయ్యిందిగా. సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తరహాలో 'బేబీ' రీమేక్ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది'' అని ఆయన చెప్పారు.
సాయి రాజేష్... సందీప్ రెడ్డి వంగా... సేమ్!
సందీప్ రెడ్డి వంగా మెగా అభిమాని అని, తనకు ఆయన చాలా ఏళ్లుగా తెలుసు అని ఎస్కేఎన్ చెప్పారు. సాయి రాజేష్ కూడా సందీప్ రెడ్డి వంగా తరహా దర్శకుడు అని వివరించారు. 'కబీర్ సింగ్'తో హిందీలో సందీప్ రెడ్డి వంగా ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారో... ఆ విధంగా సాయి రాజేష్ కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, హిందీలోనూ సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.
కొత్త పాటలు... సన్నివేశాలతో హిందీ 'బేబీ'
'బేబీ' హిందీ రీమేక్ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, సాంగ్స్ ఫైనలైజ్ అయ్యాక స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవుతుందని ఎస్కేఎన్ చెప్పారు. తెలుగులో 'బేబీ' సాంగ్స్ సూపర్ హిట్. ఆ పాటలను హిందీలో ఎందుకు వాడుకోవడం లేదు? అని ప్రశ్నించగా... ''మా దర్శకుడు సాయి రాజేష్ ఒక్కసారి వర్క్ చేసిన మ్యూజిక్ మీద మళ్లీ వర్క్ చేయాలని అనుకోవడం లేదు. మళ్లీ ఫ్రెష్ సాంగ్స్ కావాలని, హిందీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించాలని అనుకుంటున్నారు. ఆ పాటలు వింటూ స్క్రిప్ట్ రాస్తాడు. హిందీకి తగ్గట్టు కొన్ని సన్నివేశాలను మారుస్తున్నాం'' అని వివరించారు ఎస్కేఎన్.
Also Read: ప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్'... మాసోడి సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
స్టార్ కిడ్స్ యాక్ట్ చేస్తారా? ప్రేమికుల రోజు ప్రకటిస్తారా?
'బేబీ' హిందీ రీమేక్ కోసం హీరో హీరోయిన్లను ఇంకా ఫైనల్ చేయలేదని ఎస్కేఎన్ తెలిపారు. శ్రీదేవి చిన్న కుమార్తె, జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ పేరు బలంగా వినబడుతోందని ఆయన అడగ్గా... ''కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా ప్రొఫైల్స్ వచ్చాయి. ఆడిషన్స్ జరుగుతున్నాయి. ప్రజెంట్ డిస్కషన్ స్టేజిలో ఉన్నాం. అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఏదీ అనౌన్స్ చేయకూడదని డిసైడ్ అయ్యాం. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు. తొలుత ప్రేమికుల రోజు నాడు 'బేబీ' హిందీ రీమేక్ గురించి అనౌన్స్ చేయాలని అనుకున్నామని, కానీ ఇప్పుడు వీలు పడేలా లేదని ఆయన చెప్పారు. 'బేబీ' విడుదలైన తన 'కల్ట్ బొమ్మ' తనను పాపులర్ చేయడంతో ఆ టైటిల్ రిజిస్టర్ చేయించామని ఎస్కేఎన్ చెప్పారు. హిందీ రీమేక్ కోసం ఆ టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read: కొత్తగా రవితేజతో 'ఈగల్'లో రొమాన్స్, సీన్స్... కావ్య థాపర్ ఇంటర్వ్యూ