Viraatapalem PC Meena Reporting - 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్' ప్రీమియర్ డేట్: Zee5 ఓటీటీలో అభిజ్ఞ వూతలూరు వెబ్ సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే?
Viraatapalem PC Meena Reporting Release Date: అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్'. 'రెక్కీ' మేకర్స్ తీసిన సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే?

Viraatapalem PC Meena Reporting Streaming Platform: 'జీ5' ఓటీటీలో వచ్చిన 'రెక్కీ' వెబ్ సిరీస్ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సిరీస్ మేకర్స్ నుంచి మరో సిరీస్ 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' వస్తోంది. ఇవాళ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు.
జూన్ 27న 'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'
'విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్'లో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్. జూన్ 27న ZEE5లో ప్రీమియర్ కానుంది. జీ5 కోసం తీసిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ ఇది.
Viraatapalem PC Meena Reporting Web Series Story: 'విరాటపర్వం పీసీ మీనా రిపోర్టింగ్' సిరీస్ కథ విషయానికి వస్తే... ఓ మారుమూల, భయానక పల్లెటూరిలో, 1980లలో కథ జరుగుతుంది. ఆ ఊరి పేరు విరాటపాలెం. ఆ గ్రామానికి ఒక శాపం ఉంటుంది. పెళ్లి చేసుకున్న రోజున ప్రతి వధువు మరణిస్తుంది. దాంతో పదేళ్ల పాటు ఎవరూ పెళ్లి చేసుకోరు. దాంతో ఊరంతా భయం నెలకొంటుంది. ఆ టైంలో ఆ ఊరికి ఒక లేడీ పోలీసు కానిస్టేబుల్ మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది. ఆ ఊరికి ఉన్న శాపం గురించి ఆ అమ్మాయి ఏం తెలుసుకుంది? చివరకు ఆ రహస్యాన్ని ఎలా ఛేదించింది? అనేది జూన్ 27న తెలుసుకోవాలి.
Also Read: పవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?
విరాటపాలెం ఊరి అమ్మాయిలు, పెళ్ళి చేసుకుందాం అనుకుంటుంటే, వెనకడుగు వేయండి!
— ZEE5 Telugu (@ZEE5Telugu) June 17, 2025
ఈ ఊరి సంగతేంటో చూద్దాం, పదండి#ViraatapalemOnZee5 PREMIERES 27th JUNE
From the director and makers of the blockbuster #RecceOnZee5@abhignya_v@CharanLakkaraju @southindianscreens@DivyaThejaswi pic.twitter.com/mFAzFMmVKc
వీక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ సమాజాన్ని భయం ఎలా నియంత్రించగలదు? దశాబ్దాల నిశ్శబ్దాన్ని ధైర్యం ఎలా భంగపరచగలదు? అనే సామాజిక సందేశాన్ని ఈ సిరీస్ ఇస్తుందని 'జీ5' తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ తెలిపారు. 'రెక్కీ' తర్వాత మరోసరి 'జీ5'తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు కృష్ణ పోలూరు, సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మాత శ్రీరామ్ తెలిపారు. 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్'లో తానొక శక్తివంతమైన క్యారెక్టర్ చేశానని అభిజ్ఞ వూతలూరు తెలిపారు. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో కలిసి చిత్రీకరణ చేయడం మర్చిపోలేని అనుభూతి అని ఆవిడ అన్నారు.





















