Oh Bhama Ayyo Rama Release Date: అనుష్క 'ఘాటీ'తో పాటు సుహాస్ 'ఓ భామ అయ్యో రామ'... ఒకే రోజు థియేటర్లలోకి రెండు సినిమాలు
జూలై రెండో వారంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన 'ఘాటీ' విడుదల కానుంది. ఆ సినిమాతో పాటు యంగ్ హీరో సుహాస్ బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఓ భామ అయ్యో రామ' కూడా రిలీజ్ కానుంది.

జూలైలో తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సెలబ్రిటీల లిస్టులో ట్యాలెంటెడ్ యాక్టర్ - యంగ్ హీరో సుహాస్ (Suhas) కూడా జాయిన్ అయ్యారు. జూలై రెండో వారంలో, 11వ తేదీన క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న 'ఘాటీ' థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అదే రోజున సుహాస్ సినిమా కూడా రానుంది.
జూలై 11న 'ఓ భామ అయ్యో రామ' విడుదల
డిఫరెంట్ స్టోరీలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతున్న కథానాయకుడు సుహాస్. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ అయ్యో రామ'. ఇందులో మాళవికా మనోజ్ హీరోయిన్. మలయాళ సినిమా 'జో'తో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కథానాయిక ఆవిడ. ఈ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతోంది. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు.
Also Read: పవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?
ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనుంది. జూలై 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ''బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. క్యూట్ అండ్ ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయి. ప్రతి ఫేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. మా హీరో సుహాస్ ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. రామ్ పాత్రలో సుహాస్, సత్యభామగా మాళవిక మనోజ్ చాలా అద్భుతంగా నటించారు. వాళ్లిద్దరి మధ్య సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి'' అని చెప్పారు. తమ నిర్మాత ఖర్చుకు రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారని తెలిపారు.
Also Read: మహేష్ బాబు కుర్చీ మడత పెడితే... ప్రభాస్ జాతిని?
నిర్మాత హరీష్ నల్లా మాట్లాడుతూ... ''ఇదొక లవ్ రొమాంటిక్ కామెడీ సినిమా. సుహాస్ 'ఓ భామ అయ్యో రామ' అందర్నీ నవ్వించే వినోదాత్మక చిత్రమిది. సుహాస్ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. జూలై 11న ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేస్తారు'' అని అన్నారు. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' సినిమాలో అనిత హసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, 'ప్రభాస్' శ్రీను, రఘు కారుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు: బ్రహ్మ కడలి, కూర్పు: భవిన్ ఎంషా, కాస్ట్యూమ్ డిజైనర్స్: అశ్వత్ - ప్రతిభ, ప్రొడక్షన్ మేనేజర్: సంతోష్ గౌడ్,ఛాయాగ్రహణం: ఎస్ మణికందన్, సంగీతం: రథన్, నిర్మాణ సంస్థ: వి ఆర్ట్స్, నిర్మాత : హరీష్ నల్ల, రచన - దర్శకత్వం: రామ్ గోదల.





















