విక్రమ్ 'తంగలాన్' షూటింగ్ పూర్తి - 118 రోజుల ప్రయాణంలో ఎన్నో మార్పులు!
పా. రంజిత్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తంగలాన్' తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని విక్రమ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
సినిమాలో ఓ పాత్ర కోసం మేకోవర్ అవ్వాలి అంటే అది కోలీవుడ్ స్టార్ హీరో చియన్ విక్రమ్ తర్వాతే ఎవరైనా. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలను చూస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. తాను ఎంచుకున్న పాత్రకు జీవం పోస్తారు విక్రమ్. 'శివ పుత్రుడు', 'అపరిచితుడు' 'ఐ(మనోహరుడు)' వంటి సినిమాల్లో ప్రయోగాత్మక పాత్రలు పోషించి అందరి మన్ననలు పొందారు ఈ కోలీవుడ్ హీరో. అలా ఇప్పుడు మరో విభిన్న తరహా పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తంగలాన్'.కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తయింది. ఇదే విషయాన్ని హీరో విక్రమ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ మేరకు విక్రమ్ తన ట్విట్టర్లో తంగలాన్ షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ సెట్స్ లో దిగిన రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో విక్రమ్ తో పాటు మాళవిక మోహనన్, దర్శకుడు రంజిత్ కనిపించారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన విక్రమ్.. 'తంగలాన్ షూటింగ్ సాగిన 118 రోజుల్లో చాలా మార్పులు వచ్చినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేసిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని, నటుడిగా ఎంతో గొప్ప అనుభవం వచ్చిందని' అన్నారు. మరోవైపు హీరోయిన్ మాళవిక మోహన్ సైతం 'తంగలాన్' షూటింగ్ పూర్తి అయిందని తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘శారీరకంగా, మానసికంగా ఈ సినిమా తనకు సవాల్ విసిరింది’’ అని తెలిపారు. ప్రస్తుతం వీరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన రిహార్సల్స్ లో విక్రమ్ ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే. పక్కటెముక విరగడంతో షూటింగ్‌ను కొన్ని రోజులు వాయిదా వేశారు చిత్ర యూనిట్.
ఇక 'తంగలాన్' విషయానికొస్తే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విక్రమ్ సరసన మాళవిక మోహనన్, పార్వతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియా తో పాటు విదేశీ భాషల్లో 2D, 3Dలో విడుదలకు సిద్ధమవుతోంది. జీవి ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
2024 ప్రారంభంలో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా చియాన్ విక్రమ్ ఈ ఏడాది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. కానీ పార్ట్-1 కి వచ్చినంత రెస్పాన్స్ పార్ట్-2 కి రాలేదు. ఇక ఈ సినిమాలో విక్రమ్ 'ఆదిత్య కరికాలన్' పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
And it’s a wrap!! What a journey!! Worked with some of the most amazing people & had some of the most evocative experiences as an actor.
— Vikram (@chiyaan) July 4, 2023
Was it just 118 working days between the first pic & the last.
Thank you Ranjit for making us live this dream. Every single day. #thangalaan pic.twitter.com/LijMehsZeF
Also Read : అద్భుతం, ‘బలగం’ సినిమా సరికొత్త రికార్డు - ఆ లెక్కల్లో అంతర్జాతీయంగా అరుదైన ఘనత!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial