Balagam Movie: అద్భుతం, ‘బలగం’ సినిమా సరికొత్త రికార్డు - ఆ లెక్కల్లో అంతర్జాతీయంగా అరుదైన ఘనత!
‘బలగం’ సినిమాకు ఇప్పటికీ ఎక్కడో చోట ఏదొక అవార్డు వస్తూనే ఉంది. తాజాగా ఈ ‘బలగం’ మూవీ మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు.

Balagam Movie: ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే మంచి కథ ఉండాలి, ఆ కథను న ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు తెరపై చూపించాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటి సినిమానే ‘బలగం’. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి ఈ సినిమా తెరకెక్కించారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తొలి ప్రయత్నంలోనే ఎవరూ ఊహించని హిట్ ను అందుకున్నారు వేణు. ఈ సినిమా మార్చి 3, 2023 న విడుదలై ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఈ మూవీకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కడమే కాకుండా వరుస అవార్డుల పంట పండింది. ఇప్పటికీ ఈ సినిమాకు ఎక్కడో చోట ఏదొక అవార్డు వస్తూనే ఉంది. తాజాగా ఈ ‘బలగం’ మూవీ మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు.
వంద ఇంటర్నేషనల్ అవార్డులు సాధించిన ‘బలగం’..
కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించారు వేణు ఎల్దండి. తర్వాత పలు టీవీ కామెడీ ప్రోగ్రాంలలో చేశారు. ‘బలగం’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో వేణు ఎల్దండిపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీను విడుదల చేశారు. తాజాగా ఈ ‘బలగం’ సినిమా ఓ అరుదైన రికార్డును సాధించింది. మూవీ వంద అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ..‘‘మా అద్భుత ప్రయాణానికి గుర్తింపు. గతంలో 100 రోజులు ఆడే సినిమాలు ఉండేవి, తర్వాత 100 సెంటర్లలో రన్ అయ్యే సినిమాలు ఉండేవి, తర్వాత 100 కోట్ల వసూళ్లు చేసే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మేము 100 కు పైగా అంతర్జాతీయ అవార్డులు పొందిన మూవీను సాధించాం. ‘బలగం’ మాకు ప్రత్యేకమైన చిత్రం’’ అంటూ పోస్ట్ చేశారు మేకర్స్.
పల్లెల్లో ఆచారసంప్రదాయాలను తీసుకొని..
పట్టణాల్లో కంటే పల్లెటూరుల్లో ఉండే ప్రజల జీవన విధానం ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ వారి అలవాట్లు, కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలు ఆకట్టుకుంటాయి. ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే చావు తర్వాత జరిగే తంతుని తెలంగాణ పల్లె ప్రాంతాల్లో ఆచారసంప్రదాయాలను కలగలిపి తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. ఈ సినిమా ద్వారా మంచి మేసేజ్ ను కూడా అందించారు దర్శకుడు వేణు. ఈ సినిమా వరుస అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. అంతే కాదు ఇటీవల జరిగిన టిఎస్పీఎస్పీ నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలలో కూడా ‘బలగం’ సినిమా గురించి ప్రశ్న అడగడం కూడా విశేషం. అంతలా ఈ సినిమా ప్రభావం చూపింది. అందుకే రూ.3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 26 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్యా కల్యాణామ్, రూపా లక్ష్మి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: సమంత ప్రేమలో పడిందా? మరి ఆ పోస్ట్ ఏంటీ?
A journey of Excellence and Recognition! ❤️
— BA Raju's Team (@baraju_SuperHit) July 4, 2023
Earlier, we had
Films running for 100 days..
Films running in 100 centers..
Films collecting 100 crores ..
Now, we have achieved a film with 100+ international awards ❤️#Balagam is a special film for many reasons 🤗🤗… pic.twitter.com/aaqzeVtYMx





















