అన్వేషించండి

Samantha: సమంత ప్రేమలో పడిందా? మరి ఆ పోస్ట్ ఏంటీ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ప్రేమ గురించి ఓ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత మళ్లీ లవ్ లో పడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంటుంది. ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. సినిమాల విషయంలో ఆమె కెరీర్ బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది సమంత. నాగ చైతన్యతో విడాకులు తర్వాత లైఫ్ లో చాలా స్ట్రగుల్ అయింది. ఈ విషయాన్ని తాను పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చింది. ఈ సమయంలోనే ఆమెకు ‘మయోసైటిస్’ అనే వ్యాధి రావడం కూడా ఆమె మరింత కుంగదీసిందనే చెప్పాలి. అయితే ఆ సమస్యలన్నిటినీ తానే పరిష్కరించుకొని మళ్లీ ఇప్పుడు ఫుల్ యాక్టీవ్ గా షూటింగ్ లలో పాల్గొంటుంది. తాజాగా సమంత గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ప్రేమ గురించి రాసుకొచ్చింది. దీంతో ఆమె మళ్లీ ప్రేమలో పడిందంటూ వార్తలు వస్తున్నాయి.

కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి: సమంత

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా స్వేచ్ఛగా జీవిస్తుందనే వాదనలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆమె యాక్టివిటీలు కూడా ఉన్నాయి. సినిమాల్లో నటించడం, రిలేషన్స్ పై తన దృష్టి మారడం వంటి అంశాలపైనా కూడా సమంత చాలా క్లారిటీతో మాట్లాడుతోందనిపిస్తుంది. ముఖ్యంగా తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పొచ్చు. అందుకే సోషల్ మీడియాలో కూడా జీవితం గురించి ఇంట్రస్టింగ్ పోస్ట్ లు పెడుతూ తన అభిమానులను మోటివేట్ చేస్తుంది. అయితే ఒక్కోసారి ఆమె పెట్టే పోస్ట్ లు వైరల్ అవుతూ ఉంటాయి కూడా. తాజాగా ప్రేమ గురించి చెప్తూ సమంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 'చావు నుంచి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు, కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి' అంటూ ఓ ప్రముఖ రచయిత చెప్పిన కొటేషన్ ను సమంత షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ చర్చలు స్టార్ట్ చేశారు. సమంత మళ్లీ ప్రేమలో పడిందని కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

కెరీర్ లో దూసుకుపోతోన్న సమంత

హీరో అక్కినేని నాగచైతన్య, సమంత కలసి 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమాలో నటించారు. ఈ మూవీ అప్పుడే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ 2017లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే 2021 లో ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. విడాకుల తర్వాత సమంత సినిమాల్లో మరింత బిజీ అయిపోయింది. ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’ లో నటిస్తోంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ‘ఖుషి’ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. 

Also Read: విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడా? ఇదే సాక్ష్యమా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Telangana TDP: తెలంగాణ టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ రోడ్ మ్యాప్ - మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ?
తెలంగాణ టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ రోడ్ మ్యాప్ - మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ?
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Embed widget