విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడా? ఇదే సాక్ష్యమా?
లియో సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారన్న వార్తలపై మరో అప్డేట్. విజయ్, లోకేష్ కనగరాజ్‌లను చరణ్ లంచ్‌కి ఆహ్వానించారని టాక్ వినిపిస్తోంది. లియోలో నటించారు కాబట్టే ఇందుకు కారణమని ఫ్యాన్స్ అంటున్నారు.

Kollywood's Buzz : దళపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ 'లియో' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 19, 2023న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటించింది. ఫిబ్రవరిలో, 'లియో - బ్లడీ స్వీట్' ప్రోమో విడుదలైనప్పుడు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో భాగమని అందరూ ఊహించారు. అయితే దీనిపై నటులు కానీ, నిర్మాతలు కానీ ఇప్పటివరకూ స్పందించలేదు.
ఈ క్రమంలోనే 'లియో' తారాగణంలో రామ్ చరణ్ కూడా భాగమంటూ కొన్ని ఆన్‌లైన్ ఫ్లాట్ ఫామ్స్ ఓ కొత్త పుకారును సృష్టించారు. చరణ్.. విజయ్, లోకేష్ కనగరాజ్‌లను లంచ్‌కి ఆహ్వానించారని, వారు అంగీకరించారని కూడా ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నటించడం వల్లే వారిని ఆహ్వానించాడని కొందరు మెగా ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ఊహాగానాలపై చరణ్ లేదా విజయ్ లేదా లోకేష్ కనగరాజ్ లలో ఎవరో ఒకరు ధృవీకరించే వరకు ఈ వార్త వాస్తవమేనని నమ్మడానికి లేదు. మరి వారు ఈ ప్రచారంపై స్పందిస్తారా, నిజంగానే చరణ్ ఈ సినిమాలో నటించాడా అన్న విషయాలు తెలియాలంటే వారు చేసే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా రామ్ చరణ్, దర్శకుడు శంకర్ తో కలిసి తన నెక్ట్స్ భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్.. ప్రారంభంలో ఆ స్పీడ్ చూసి మెగా ఫ్యాన్స్ చాలా ఖుషీ అయ్యారు. కానీ ఊహించని విధంగా మధ్యలోకి 'ఇండియన్ 2(Indian 2)' లైన్లోకి రావడంతో.. అభిమానులు కాస్త గట్టిగానే డిసప్పాయింట్ అయ్యారు. విక్రమ్ హిట్ జోష్‌లో ఆగిపోయిన ‘ఇండియన్ 2’ జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేయాలని కమల్ ఫిక్స్ అయిపోయాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్(Game Changer), ఇండియన్ 2 సినిమాలు ఈక్వల్‌గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కానీ గేమ్ ఛేంజర్ అనుకున్న దానికంటే మరింత డిలే అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే తనకు పుట్టిన బిడ్డతో గడిపేందుకు రామ్ చరణ్ షూటింగ్ లకు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 'గేమ్ ఛేంజర్' మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక చెర్రీ ఈ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో ఆగస్టులో జాయిన్ అవనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'ఇండియన్ 2' ను స్టార్టింగ్ లో వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Thalapathy Vijay: దళపతి విజయ్ షాకింగ్ నిర్ణయం, సినిమాలకు మూడేళ్లు బ్రేక్? కారణం అదేనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు





















