అన్వేషించండి

Vijayashanthi: విజయశాంతి ఈజ్ బ్యాక్ - కళ్యాణ్ రామ్ సినిమాలో Vyjayanthi IPSగా యాక్షన్ అదరగొట్టారుగా!

Vijayashanthi First Look In NKR21: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

Vijayashanthi Role And First Look From NKR 21 Revealed: విజయశాంతి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు పవర్ ఫుల్ యాక్షన్ రోల్స్ గుర్తుకు వస్తాయి. లేడీ సూపర్ స్టార్ బిరుదు అందుకున్న తొలి కథానాయిక ఆవిడ. అగ్ర హీరోల సినిమాల్లో కథానాయికగా నటించడంతో పాటు శక్తివంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ఆవిడ చేశారు. కొంత విరామం తర్వాత మళ్ళీ పవర్ ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే... 

'వైజయంతి ఐపీఎస్'గా విజయశాంతి!
విజయశాంతి టాప్ 10 ఫిలిమ్స్ తీస్తే... ఆ జాబితాలో 'కర్తవ్యం' సినిమా తప్పకుండా ఉంటుంది. నిజాయతీ గల పోలీస్ అధికారిగా వైజయంతి ఐపీఎస్ పాత్రలో ఆవిడ కనబరిచిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మరోసారి ఆ పాత్రతో ఆవిడ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోగా కళ్యాణ్ రామ్ 21వ చిత్రమిది. అందుకని, NKR 21 వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతి కూడా నటిస్తున్నారు. ఆవిడ వైజయంతి ఐపీఎస్ రోల్ చేస్తున్నారు.

విజయశాంతి పుట్టిన రోజు (Vijayashanthi Birthday) సందర్భంగా ఇవాళ సినిమాలో ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ''వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది. వేసుకుంటే యూనిఫార్మ్ కి పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం... నేనే తన సైన్యం'' అంటూ విజయశాంతి పాత్రను నందమూరి కళ్యాణ్ రామ్ పరిచయం చేశారు.

Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు

వైజయంతిగా విజయశాంతి పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్పిన కళ్యాణ్ రామ్... తాను ఆమె సైన్యం అని చెప్పడం ద్వారా కథానాయకుడి క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ అని చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు.

Also Read: విజయ్ దేవరకొండ 'కల్కి' కాదు... ప్రభాస్ సినిమాలో కురుక్షేత్రంలో యుద్ధవీరుడిగా... ఆయన రోల్ ఏమిటంటే?


నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ప్రధాన పాత్రధారి. సోహైల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్, కూర్పు: తమ్మిరాజు, స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
MI vs CSK: నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP Desm

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
MI vs CSK: నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
Crime News: నగరంలో మరో విషాదం.. కూల్ డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెకు ఇచ్చి, తాను తాగిన తల్లి! చిన్నారి మృతి
మరో విషాదం.. కూల్ డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెకు ఇచ్చి, తాను తాగిన తల్లి! చిన్నారి మృతి
Rishabh Pant: ఐపీఎల్​ చరిత్రలోనే రికార్డు ధర.. కానీ చెత్త ప్రదర్శన అంటూ రిషభ్ పంత్ ఆటపై ట్రోలింగ్
ఐపీఎల్​ చరిత్రలోనే రికార్డు ధర.. కానీ చెత్త ప్రదర్శన అంటూ రిషభ్ పంత్ ఆటపై ట్రోలింగ్
Kubera First Single: ధనుష్, నాగార్జున 'కుబేర' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - 'పోయి రా మావా' చూసేద్దామా!
ధనుష్, నాగార్జున 'కుబేర' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - 'పోయి రా మావా' చూసేద్దామా!
Embed widget