Prabhas: ప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌గా 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌లో బిజినెస్, రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు
Kalki 2898 AD: 'కల్కి' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాలు, హిందీతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి 385 కోట్లకు అమ్మారట. దీనికి ముందు ప్రభాస్ సినిమాల బిజినెస్ ఎలా ఉందో తెలుసా?
Prabhas last 5 movies pre release business details: ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ బాహుబలి ప్రభాస్. ఆయన సినిమా చేస్తే కలెక్షన్స్ షేక్ అవ్వాలంతే! మరీ ముఖ్యంగా రెబల్ స్టార్ సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. డిజాస్టర్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం భారీ ఓపెనింగ్స్ సాధించాయి అంటే... బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ స్టామినా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్టార్ హీరో లేటెస్ట్ సినిమా 'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 385 కోట్లు అని టాక్. మరి, దీనికి ముందు ప్రభాస్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరిగిందో తెలుసా?
'కల్కి 2898 ఏడీ' సినిమాకు ముందు...
ప్రభాస్ లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్!
'కల్కి 2898 ఏడీ'కి ముందు వచ్చిన ప్రభాస్ సినిమా 'సలార్'. ఆ సినిమా బిజినెస్ రీసెంట్ మూవీ కంటే తక్కువ. రూ. 345 కోట్లతో సరిపెట్టుకుంది. అది భారీ హిట్ కావడంతో 'కల్కి 2898 ఏడీ'కి బిజినెస్ బాగా జరిగింది. ఆ రెండు సినిమాలతో పాటు వాటి ముందు సినిమాల బిజినెస్ ఎలా ఉందో చూడండి.
నంబర్ | సినిమా పేరు | ప్రీ రిలీజ్ బిజినెస్ |
1 | కల్కి 2898 ఏడీ | రూ. 385 కోట్లు |
2 | సలార్ 1 | రూ. 345 కోట్లు |
3 | ఆదిపురుష్ | రూ. 240 కోట్లు |
4 | రాధే శ్యామ్ | రూ. 202.80 కోట్లు |
5 | సాహో | రూ. 270 కోట్లు |
6 | బాహుబలి 2 | రూ. 352 కోట్లు |
7 | బాహుబలి 1 | రూ. 118 కోట్లు |
Also Read: తెలంగాణలో 'కల్కి'కి సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్స్‌లో 100... ఆ బడ్జెట్‌కు సరిపోతాయా?
ప్రభాస్ లాస్ట్ ఫైవ్ ఫిల్మ్స్ తీసుకుంటే... ఒక్కో సినిమా ఏవరేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 288.56 కోట్లు. ఐదు సినిమాల టోటల్ బిజినెస్ రూ. 1442.8 కోట్లు. అంటే ఒక్కో సినిమా అటు ఇటు పది కోట్లు తక్కువగా రూ. 300 కోట్లు బిజినెస్ చేసింది. తెలుగు మాత్రమే కాదు... హిందీ హీరోల్లో సైతం చాలా మందికి ఈ రేంజ్ రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మార్కెట్ లేదు. దాంతో ఇప్పుడు ఇండియాలో రెబల్ స్టార్ (Prabhas)ను 'ఢీ' కొట్టేవాడు లేరంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'కల్కి 2898 ఏడీ' బాక్స్ ఆఫీస్ బరిలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలు తెస్తే... నెక్స్ట్ సినిమాల బిజినెస్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఏపీ, తెలంగాణలో టికెట్ రెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో పాటు ఐదో షో వేసుకునే వెసులుబాటు కూడా వచ్చింది. దాంతో కలెక్షన్లు భారీ ఎత్తున ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Presenting #KalkiReleaseTrailer to you all!
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 21, 2024
- https://t.co/mjF7H8BXvy#Kalki2898AD in cinemas worldwide from June 27th.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/BF0qeCeQag