'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరిగింది? ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారు? అనేది చూడండి. 

నైజాంలో 'కల్కి 2898 ఏడీ'ని 70 కోట్లకు అమ్మారని తెలిసింది. 

రాయలసీమ (సీడెడ్) హక్కులను రూ. 27 కోట్లకు అమ్మినట్లు సమాచారం అందించింది. 

ఆంధ్రకు వెళితే... ఉత్తరాంధ్ర హక్కుల ద్వారా 'కల్కి 2898 ఏడీ' నిర్మాతలకు 23 కోట్లు వచ్చాయి.

తూర్పు గోదావరి రూ.15 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 11 కోట్లు, గుంటూరు రూ. 13 కోట్లకు ఇచ్చారట.

నెల్లూరు రైట్స్ రూ. 8 కోట్లు పలుకగా... కృష్ణ రైట్స్ ద్వారా రూ. 13 కోట్లు వచ్చాయి.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 180 కోట్లు!

తెలుగులో సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళకు లాభాలు రావాలంటే ఈ సినిమా మినిమమ్ 200 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి.

ప్రజెంట్ ప్రభాస్ క్రేజ్, 'కల్కి 2898 ఏడీ' బజ్ చూస్తుంటే అంత రావడం కష్టం ఏమీ కాదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల నుంచి ఐదో ఆటకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు వచ్చాయి.