అన్వేషించండి

Jana Nayagan Censor Review : జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Jana Nayagan Release Date : దళపతి విజయ్ జన నాయగన్‌కు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్ దక్కింది. సెన్సార్ బోర్డు మూవీకి సర్టిఫికెట్ ఇష్యూ చేసింది. దీంతో త్వరలోనే రిలీజ్ కానుంది.

Vijay's Jana Nayagan Gets A Certificate From CBFC :  కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ 'జన నాయగన్'కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ వివాదాలతో రిలీజ్ ఆగిపోయింది. తాజాగా గురువారం సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇస్తూ A సర్టిఫికెట్ జారీ చేసింది.

రన్ టైం ఎంతంటే?

గురువారం ఉదయం నుంచీ సోషల్ మీడియాలో జన నాయగన్ సెన్సార్ సర్టిఫికెట్, రిలీజ్ డేట్ గురించి ప్రచారం సాగుతూనే ఉంది. మొత్తానికి దానిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఫైనల్‌గా విజయ్ చివరి సినిమాకు A సర్టిఫికెట్ ఇస్తూ... 3 గంటల 3 నిమిషాల (183 నిమిషాలు) రన్ టైం ఫిక్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇటీవల సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందన్న ప్రచారాన్ని ఖండించిన మేకర్స్... బోర్డు సూచనల మేరకు కొన్ని కట్స్ చేసి మళ్లీ రివ్యూకు పంపుతామని చెప్పారు. ఇంతలోనే CBFC నుంచి సర్టిఫికెట్ వచ్చేసింది.

Also Read : Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్

రిలీజ్ ఎప్పుడు?

ఇప్పటివరకూ సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులు, పైరసీ ఇష్యూస్‌తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న 'జన నాయగన్' రిలీజ్‌కు మార్గం సుగమం కావడంతో దళపతి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక మేకర్స్ రిలీజ్‌పై ఫోకస్ చేశారు. జులై 24న తమిళం, తెలుగు సహా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ప్రేమలు ఫేమ్ మమితా బైజు కీలకపాత్ర పోషించారు. వీరితో పాటే ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు మాస్, యాక్షన్ అంశాలను టచ్ చేస్తూ యాక్షన్ ఎంటర్టైనర్‌గా మూవీని రూపొందించారు. 

Also Read : I Nobody Twitter Review - ఐ నోబడీ ట్విట్టర్ రివ్యూ: సాలిడ్ సక్సెస్ కొట్టిన పృథ్వీరాజ్  - సినిమాపై నెటిజన్స్ ఏమంటున్నారంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Embed widget