అన్వేషించండి

మయోసైటీస్‌తో సమంత ఎంతలా పోరాడిందో చెప్పలేను - ఆమె ముఖంలో నవ్వు చూడాలి, అదే నా కోరిక : విజయ్ దేవరకొండ

మంగళవారం రాత్రి హైదరాబాదులోని నోవాటెల్ లో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన 'ఖుషి' సినిమాకు సంబంధించి మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని నోవాటెల్ లో 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్' ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సమంత గురించి విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ముందుగా ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, సమంత అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత డాన్సులతో అదరగొట్టారు. విజయ్ దేవరకొండ షర్ట్ విప్పి మరి డాన్సులు చేయడం హైలైట్ గా నిలిచింది.

ఇక తర్వాత ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.." గత ఏడాది ఏప్రిల్ లో నవ్వుతూ ఈ సినిమాని స్టార్ట్ చేసాం. అంతా సాఫీగా సాగింది. ఇంకా 30 శాతం షూటింగ్ పెండింగ్ ఉంది. సమంత మూడు రోజులు వస్తే ఆమె పార్ట్ షూటింగ్ అయిపోతుంది. సమంత వస్తుందని అందరం భావించారు. కానీ ఆ సమయంలో తన ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. రెండు, మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోతుందిలే అనుకున్నాం. కానీ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని చెప్పింది. ఆ తర్వాత రెండు, మూడు వారాలు రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది అనుకున్నాం. కానీ కాలేదు. ఆ తర్వాత ఒక ఈవెంట్లో సమంత ఓ పెద్ద హెల్త్ ఇష్యూ తో బాధపడుతుందని తెలిసింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించిందని" విజయ్ అన్నారు.

" నిజానికి సమంత గురించి ఈ విషయాలు చెప్పకూడదని అనుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం చాలామందికి వచ్చింది  కరోనా తర్వాత చాలామంది ఇలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనకు హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ పనిచేయచ్చు. బాధపడాల్సిన అవసరం లేదు. సరిగ్గా సమంత కూడా అదే చేసింది. తన లైఫ్ లో చాలా కష్టాలను ఎదుర్కొంది. ఎంతో పోరాడింది. ఆరోగ్యం నుంచి కోలుకొని సినిమా షూటింగ్ లు చేసింది. ఇప్పుడు మీకోసం డాన్స్ చేసింది. ఇప్పటికీ సమంత హెల్త్ సరిగ్గా లేదు. లైట్స్ పడితే ఆమెకు తలనొప్పి వస్తుంది. కళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అయినా కూడా మీ అందరి కోసం ఇక్కడికి వచ్చింది. 'ఖుషి' హిట్టుతో ఆమె ముఖంలో నవ్వు చూడాలనుకుంటున్నాను" అంటూ సమంత గురించి మాట్లాడారు విజయ్.

ఆ తర్వాత డైరెక్టర్ శివ నిర్మాణ గురించి మాట్లాడుతూ.." నాతో సినిమా చేయడం కోసం ఎంతో వెయిట్ చేశాడు. మధ్యలో ఒకటి, రెండుసార్లు ఆగిపోయినా ఆయన ముఖంలో నవ్వు తగ్గలేదు. అదే మెయింటైన్ చేశారు. నన్ను ఆయన ఎంత ప్రేమించాడో ఆ ప్రేమని సినిమాలో పెట్టాడు. అంతే ప్రేమించి సినిమాను తీశాడు. కచ్చితంగా ఈ సినిమా అలరిస్తుంది. నాకు హిట్ వచ్చి చాలా రోజులు అవుతుంది. హీరోగా నా జర్నీ స్టార్ట్ అయి 6 నుంచి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ జర్నీలో ఎంతో హైట్స్ చూసా, లోస్ చూసా. నా చుట్టూ ఉన్న చాలామంది మారిపోయారు. కానీ నాపై మీ ప్రేమ అసలు తగ్గలేదు. అదే ప్రేమను చూపిస్తున్నారు. అలాగే మీరంతా చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మీ ముఖంలో నవ్వు చూడాలని కోరుకుంటున్నా. సెప్టెంబర్ 1న మీ ముఖంలో నవ్వు చూస్తానని ఆశిస్తున్నా" అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.

Also Read : 'ప్రభాస్ ఓ మెగాస్టార్' అంటూనే వార్ కి రెడీ అయిన 'వ్యాక్సిన్ వార్' డైరెక్టర్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget