VD13 - Sankranti 2024 : సంక్రాంతి రేసులో విజయ్ దేవరకొండ సినిమా - అఫీషియల్ గురూ!
VD13 Movie Release Date : సంక్రాంతి రేసులో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఎంటరైంది. షూటింగ్ స్టార్ట్ చేసిన రోజునే విడుదల ఎప్పుడో కూడా చెప్పేశారు.
![VD13 - Sankranti 2024 : సంక్రాంతి రేసులో విజయ్ దేవరకొండ సినిమా - అఫీషియల్ గురూ! Vijay Deverakonda, Mrunal Thakur's VD13 enters into Pongal Race, Movie releasing for Sankranti 2024 VD13 - Sankranti 2024 : సంక్రాంతి రేసులో విజయ్ దేవరకొండ సినిమా - అఫీషియల్ గురూ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/15/877e3b8e5ebc9199f4c7ca0c2678d0861689437492669313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాబోయే సంక్రాంతి రేసులో 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఎంటరయ్యారు. ఆయన కథానాయకుడిగా 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి (VD13 Movie Release Date) విడుదల చేయనున్నట్లు నేడు వెల్లడించారు. పండక్కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు.
రౌడీ బాయ్స్... షూటింగ్ మొదలైంది
VD13 Shoot Starts Today : విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వచ్చాయి. 'ఖుషి' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని ఈ రోజు అనౌన్స్ చేశారు. తర్వాత కొంత సేపటికి పరశురామ్ దర్శకత్వంలో షూటింగ్ మొదలు పెట్టామని మరో అప్డేట్ వచ్చింది. 'ఖుషి' సెట్స్ నుంచి ఈ సినిమా చిత్రీకరణలో విజయ్ దేవరకొండ జాయిన్ అయ్యారన్నమాట.
నాలుగు నెలల వ్యవధిలో రెండు సినిమాలు
సెప్టెంబర్ 1న 'ఖుషి' విడుదల కానుంది. ఆ సినిమా విడుదలైన నాలుగు నెలలకు మరో సినిమాతో సంకాంతికి థియేటర్లలో విజయ్ దేవరకొండ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి మహేష్ బాబు 'గుంటూరు కారం', ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', రవితేజ 'ఈగల్', తేజా సజ్జ 'హను - మాన్' కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి.
View this post on Instagram
విజయ్ దేవరకొండ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజుల నుంచి వినబడుతోంది. ఈ రోజు ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అదీ సంగతి!
Also Read : మహేష్ బాబు కుమార్తె గొప్ప మనసు - ఆ డబ్బులన్నీ ఛారిటీకే...
అమెరికాలో VD13 Movie చిత్రీకరణ!
విజయ్ దేవరకొండ, పరశురామ్ తాజా సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 54వ సినిమా. హీరోకి 13వది. ఈ చిత్రానికి 'ఫ్యామిలీ స్టార్' (VD 13 titled as Family Star) టైటిల్ ఖరారు చేశారట. ఈ సినిమా కోసం 'దిల్' రాజు, దర్శకుడు పరశురామ్, చిత్ర బృందంలో కీలక సభ్యలు కొందరు కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ లొకేషన్స్ రెక్కీ చేశారు. కథలో కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.
విజయ్ సరసన మృణాల్!
విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను కథానాయిక ఎంపిక చేశారు. 'సీతా రామం'లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత నాని సినిమాలో అవకాశం అందుకున్నారు. తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా. విజయ్ దేవరకొండతో, 'దిల్' రాజు నిర్మాణంలో మొదటి సినిమా.
Also Read : ప్రభాస్, దీపిక సినిమా టైటిల్ 'కాలచక్రం'- కె మీనింగ్ అదేనా?
దర్శకుడు పరశురామ్ తీసిన చివరి మూడు సినిమాలు చూస్తే... హీరో ఒరిజినల్ పేరును సినిమాలో క్యారెక్టర్ పేరుగా ఫిక్స్ చేశారు. 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు పేరు మహి అలియాస్ మహేష్. 'గీత గోవిందం'లో విజయ్ గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండను చూపించారు. 'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ పేరు శిరి అలియాస్ శిరీష్. 'ఫ్యామిలీ స్టార్'కు వస్తే విజయ్ దేవరకొండను కుటుంబ రావుగా చూపించబోతున్నారని టాక్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)