అన్వేషించండి

Project K Title : ప్రభాస్, దీపిక సినిమా టైటిల్ 'కాలచక్రం'- కె మీనింగ్ అదేనా?

Project K Movie Title announcement : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ హీరోగా తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ కె' టైటిల్ ఈ నెల 21న అనౌన్స్ చేయనున్నారు. అయితే... 'కె' అంటే కాలచక్రం అని టాక్.   

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ (Project K Movie). ఇందులో 'కె' అంటే ఏమిటి? ఆ పదానికి అర్థం ఏమిటి? తెలుసుకోవాలని ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతీయ కాలమానం ప్రకారం ఈ నెల 21న ఉదయం ఒంటి గంట నుంచి రెండున్నర గంటల మధ్యలో అనౌన్స్ చేయనున్నారు. అయితే... టైటిల్ లీక్ అయినట్లు తెలుస్తోంది. 

కె అంటే కాలచక్రం?
Project K Title : 'ప్రాజెక్ట్ కె'లో కె... అంటే 'కాలచక్రం' (KaalChakra) అని జోరుగా హుషారుగా ప్రచారం జరుగుతోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కనుక ఆ టైటిల్ అయితే బావుంటుందని ఫిక్స్ అయ్యారట. 

కాలంలో వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం వంటి అంశాల నేపథ్యంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా రూపొందుతోంది. కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. మరి, ఈ కాలచక్రం చేసే మాయ ఏమిటో? వెండితెరపై చూడాలి. సృష్టిలో విధ్వంస శక్తులను కథానాయకుడు ఎదుర్కోవడంలో కాలచక్రం పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కె అంటే కాలచక్రమా? కదా? అనేది మరో ఆరు రోజుల్లో తెలుస్తుంది. 

Also Read బాలకృష్ణ సినిమా హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్

Project K Means : 'ప్రాజెక్ట్ కె' చిత్రానికి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడీగా దీపికా పదుకోన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ సిటీలో ఉన్నారు. షూటింగ్ చేస్తున్నారు.  జూలై 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో జరిగే కామిక్ కాన్ వేడుకల్లో 'ప్రాజెక్ట్ కె' టైటిల్, ఇంకా గ్లింప్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. జూలై 20న టైటిల్ ఏమిటో వెల్లడించనున్నారు. ఇండియన్ టైమింగ్ ప్రకారం జూలై 21న టైటిల్ రిలీజ్. ఆ కార్యక్రమం కోసం ప్రభాస్‌, దీపికా పదుకోన్ సహా చిత్ర బృందంలో కీలక సభ్యులు పాల్గొంటారు. అందుకోసమే ఈ షెడ్యూల్ వారంలో ఎండ్ చేయనున్నారు. ఆల్రెడీ 'ప్రాజెక్ట్ కె' టీ షర్టులు అందుబాటులోకి వచ్చాయి. వాటితో అమితాబ్, ఇంకా అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. 

Also Read : 'ఖుషి' - గుమ్మడికాయ కొట్టేశారు, కేక్ కట్ చేసిన విజయ్ దేవరకొండ

'ప్రాజెక్ట్ కె'లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్‌లో ఒకరైన అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇటీవల లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు. 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ (Prabhas)కు ధీటైన ప్రతినాయకుడిగా కమల్ హాసన్ (Kamal Haasan) నటించనున్నారని కొన్ని రోజులుగా వినపడుతోంది. విలన్ అని చిత్ర బృందం చెప్పలేదు గానీ సినిమాలో కమల్ ఉన్నారని కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలు పెట్టారు.

ఈ సినిమాలో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న సినిమా విడుదల చేయనున్నారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Simbu Andrea Jeremiah : 43 ఏళ్ల శింబుకు తల్లిగా 40 ఏళ్ల హీరోయిన్ ఆండ్రియా
43 ఏళ్ల శింబుకు తల్లిగా 40 ఏళ్ల హీరోయిన్ ఆండ్రియా
I Nobody Twitter Review - ఐ నోబడీ ట్విట్టర్ రివ్యూ: సాలిడ్ సక్సెస్ కొట్టిన పృథ్వీరాజ్  - సినిమాపై నెటిజన్స్ ఏమంటున్నారంటే?
ఐ నోబడీ ట్విట్టర్ రివ్యూ: సాలిడ్ సక్సెస్ కొట్టిన పృథ్వీరాజ్  - సినిమాపై నెటిజన్స్ ఏమంటున్నారంటే?
Payal Rajput : అలా అయితే డోంట్ సబ్ స్క్రైబ్ - పాయల్ ఇన్ స్టా పోస్ట్ వైరల్
అలా అయితే డోంట్ సబ్ స్క్రైబ్ - పాయల్ ఇన్ స్టా పోస్ట్ వైరల్
Agadha Release Date : గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget