Natasha Doshi : బాలకృష్ణ సినిమా హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్ - అంతా లవ్వే!
Tollywood Heroine Engagement : నట సింహం నందమూరి బాలకృష్ణ 'జై సింహా' సినిమాలో నటించిన హీరోయిన్ పెళ్ళికి రెడీ అయ్యారు. తనకు నిశ్చితార్థమైనట్లు ఆమె పేర్కొన్నారు.
![Natasha Doshi : బాలకృష్ణ సినిమా హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్ - అంతా లవ్వే! Actress Natasha Doshi engaged to Manan, Balakrishna Jai Simha heroine Natasha Doshi : బాలకృష్ణ సినిమా హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్ - అంతా లవ్వే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/15/57d3d249478c40e2bae3a96b1e3ab1e91689417160350313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'జై సింహా' గుర్తు ఉందా? ఆ సినిమాలో కథానాయిక ఎవరు? అని అడిగితే... ఠక్కున నయనతార పేరు చెబుతారంతా! నయన్ కాకుండా మరో ఇద్దరు అందాల భామలు కూడా ఆ సినిమాలో నటించారు. నటుడు వశిష్ఠ సింహతో ఆ ఇద్దరిలో హరిప్రియకు కొన్ని రోజుల క్రితం పెళ్లి అయ్యింది. నయన్ కూడా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో భామ పెళ్ళికి సిద్ధమైంది.
అమ్ముకుట్టికి నిశ్చితార్థం
'జై సింహా' సినిమాలో ఓ కథానాయికగా నటించిన నటాషా దోషి (Natasha Doshi)కి శుక్రవారం నిశ్చితార్థం జరిగింది. మనన్ షా (Manan) అనే యవకుడితో ఆమె ఏడు అడుగులు వేయనున్నారు. ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను నటాషా దోషి విడుదల చేశారు. అయితే... పెళ్లి ఎప్పుడు? అనేది ఆమె చెప్పలేదు. 'ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది' అని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆమెది ప్రేమ వివాహం అని తెలుస్తోంది.
View this post on Instagram
'జై సింహా' కంటే ముందు మలయాళంలో నటాషా దోషి నాలుగు సినిమాలు చేశారు. బాలకృష్ణ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ సరసన 'కోతల రాయుడు' సినిమా చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన 'ఎంత మంచివాడవురా' సినిమాలో ప్రత్యేక గీతం చేశారు.
Also Read : వాటీజ్ థిస్ బేబీ - విజయ్ దేవరకొండకు దూరంగా రష్మిక
తెలుగులో ఆశించిన రీతిలో నటాషా దోషికి అవకాశాలు అయితే రాలేదు. 'జై సింహా' సినిమాలో 'అమ్మ కుట్టి' పాటలో డ్యాన్స్ బాగా చేశారని పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఆమె చాలా మంది అమ్ముకుట్టి అని పిలవడం మొదలు పెట్టారు. పెళ్లి తర్వాత కూడా నటాషా దోషి సినిమాలు చేసే అవకాశం కనబడుతోంది.
Also Read : 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? లేడీ అర్జున్ రెడ్డి అనే సినిమానా?
దసరాకు 'భగవంత్ కేసరి'
ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాలకు వస్తే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న 'భగవంత్ కేసరి' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఆయన జోడీగా తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది.
ఎన్నికలకు ముందు బాబీ సినిమా విడుదల
వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మరో సినిమాతో నందమూరి బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కథానాయకుడిగా బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో సినిమా కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.
ఎన్నికల తర్వాత అబ్బాయితో సినిమా!
ఏపీలో ఎన్నికలు పూర్తైన తర్వాత అబ్బాయి మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తూ బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్స్' చేయనున్నారు. ఆ సినిమాలో బాలకృష్ణ మెయిన్ హీరో అని, తనయుడు మోక్షజ్ఞ కీలక పాత్ర చేస్తారని సమాచారం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)