Kingdom: తిరుపతిలో విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్... రిలీజ్ డేట్ ఫిక్స్
Kingdom Trailer Release Date: 'ది' విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'కింగ్‌డమ్' జూలై 31న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరి ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తున్నారో తెలుసా?

'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కింగ్‌డమ్' (Kingdom). జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, 'హృదయం లోపల', 'అన్న అంటేనే' పాటలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు టీమ్ రెడీ అయ్యింది.
తిరుపతిలో 'కింగ్‌డమ్' ట్రైలర్ విడుదల!
Kingdom Trailer Launch Event At Tirupati: తిరుపతిలో 'కింగ్‌డమ్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నెల (జూలై) 26న భారీ ఈవెంట్ చేయనున్నట్లు వివరించింది. అభిమానుల సమక్షంలో 'కింగ్‌డమ్' ట్రైలర్ విడుదల కానుంది.
View this post on Instagram
విజయ్ దేవరకొండ సరసన 'మిస్టర్ బచ్చన్' భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాలో హీరో అన్నయ్య పాత్రలో సత్యదేవ్ నటించారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు 'కింగ్‌డమ్' రానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC - గిరీష్ గంగాధరన్ ISC, కూర్పు: జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి.





















