Boycott HHVM: పవన్ కళ్యాణ్ vs వైసీపీ... సినిమా విడుదలకు ముందే మొదలైన యుద్ధం - బాయ్ కాట్ పిలుపు వెనుక అసలు కారణం ఇదే!
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు సినిమా మీద, అందులో హీరో పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపు ఇచ్చారు.

Hari Hara Veera Mallu Latest News: వీరమల్లు విడుదలకు ముందు వైసీపీ పార్టీకి చెందిన అభిమానులు అలాగే కొంత మంది యాంటీ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరి ముఖ్యంగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నారు.
సినిమా వేదికలపై రాజకీయాలు ఎందుకు?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కథానాయకుడు మాత్రమే కాదు... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా! ఆయన దగ్గర కొన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ప్రభుత్వంలో తన విధులు నిర్వహిస్తూ వీరమల్లు చిత్రీకరణకు ప్రతి ఉదయం రెండు గంటల సమయం ఇచ్చిన రోజులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ వ్యాఖ్యల మీద వైసిపి ఫ్యాన్స్ విషం చిమ్ముతున్నారు.
This is not about money…
— YS Jagan Army ®️ (@YSJaganAarmy) July 21, 2025
This is not about finance…
This is not about records…
This is about damn FEAR 🤣🤣🤣#HariHaraVerraMallu #BoycottHHVM pic.twitter.com/zrSgVAGNbd
సినిమా వాళ్ళు ఇంకా మారారా ??#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !! pic.twitter.com/qAJzYhjj6f
— cinee worldd (@Cinee_Worldd) July 21, 2025
జగన్ నీ అభిమానించే ఏ YCP కార్యకర్త HHVM కి వెళ్ళడు..
— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) July 21, 2025
అలా వెళితే సిగ్గుమాలిన వాడి కిందే లెక్క..
సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడినందుకు.. #boycottHHVM pic.twitter.com/RjHEBDP6GW
'భీమ్లా నాయక్' విడుదల సమయంలో వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించింది. ఏపీలోని థియేటర్లలో 10 నుంచి 15 రూపాయలకు టికెట్లు అమ్మిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ అంశాన్ని పవన్ మరోసారి ప్రస్తావించారు. రికార్డులు డబ్బుల గురించి కాదని గట్స్ గురించి అంటూ ఆయన ఘాటుగా మాట్లాడారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఓ లెజెండ్... వీరమల్లు విడుదలకు ముందు క్రిష్ ట్వీట్... వైరల్ స్టేట్మెంట్ చూశారా?
Get ready to face trolls #HHVM
— Aji (@AJAY83527762580) July 21, 2025
మూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿
గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI
కనిపించకుండా పోయిన ఆ 30,000 అమ్మాయిలను తీసుకచ్చాకే @HHVMBookings సినిమాకు వెళ్లండి, ఎవరు అడిగిన ఇదే చెప్పి ఆపండి!
— VoiceOfAndhra (@VoicesOfAndhra) July 21, 2025
Mixing Politics into Movies 👍👍👍#BoycottHHVM #Pawankalyan pic.twitter.com/QAssteLCuz
'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ... ''సినిమాలో ఔరంగజేబును ఓడించడానికి ముందు నిజ జీవితంలో ఔరంగజేబు ఓటమిలో పవన్ కీలక పాత్ర పోషించారు'' అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అన్ని సూటిగా వైసీపీని ఉద్దేశించి చేసినవే. దాంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం 'హరి హర వీరమల్లు' సినిమా మీద నెగిటివ్ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసింది. సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్లో పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.





















