అన్వేషించండి

Krish Jagarlamudi: పవన్ ఓ లెజెండ్... వీరమల్లు విడుదలకు ముందు క్రిష్ ట్వీట్... వైరల్ స్టేట్మెంట్ చూశారా?

Krish Jagarlamudi on HHVM: 'హరిహర వీరమల్లు' విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సినిమాపై స్పందించారు. పవన్ కళ్యాణ్ లెజెండ్ అని పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Hari Hara Veera Mallu Latest News: 'హరి హర వీరమల్లు' విడుదలకు కొన్ని గంటల ముందు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తి అయ్యింది. విడుదలకు ముందు సినిమా గురించి క్రిష్ జాగర్లమూడి తొలిసారి ఓ వేదికపై స్పందించారు.‌ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‌నిర్మాత ఏయం రత్నం గురించి ఆయన ఏమన్నారో చూడండి.

ఆ ఇద్దరు లెజెండ్స్ వల్లే సాధ్యం!
ఇద్దరు లెజెండ్స్ వల్ల 'హరిహర వీరమల్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్రిష్ జాగర్లమూడి పేర్కొన్నారు. ఇద్దరిలో ఒకరు పవన్ కళ్యాణ్ అయితే మరొకరు నిర్మాత ఏయం రత్నం. 

''ఇప్పుడీ ప్రపంచంలోకి 'హరిహర వీరమల్లు' అడుగు పెడుతున్నాడు. అది కూడా నిశ్శబ్దంగా, మామూలుగా కాదు... ఒక ఉద్దేశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.‌ ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ వెనక మన చరిత్ర‌‌పై ప్రేమ, బరువు బాధ్యతలు ఉన్నాయి.‌ ఈ సినిమాలో మాత్రమే కాదు... ఈ సినిమాకు స్ఫూర్తి వెనుక ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు'' అని క్రిష్ తెలిపారు. 

Krish Jagarlamudi On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి క్రిష్ మాట్లాడుతూ... ''పవన్ కళ్యాణ్ గారు ఒక అసాధారణ శక్తి ఉంది. ఏ కెమెరా క్యాప్చర్ చేయలేని ఫైర్ ఆయనలో ఉంది.‌‌ నిత్యం అగ్ని గోళంలా ఈ సినిమాకు స్ఫూర్తి ఇచ్చారు.‌ 'హరిహర వీరమల్లు'కు ఆయన ప్రాణం పోశారు. ఈ చిత్రానికి ఆయన వెన్నుముక మాత్రమే కాదు ఆత్మ కూడా'' అని పేర్కొన్నారు. 

Krish Jagarlamudi On AM Ratnam: నిర్మాత ఏం రత్నం గురించి మాట్లాడుతూ... ''భారతీయ తెరపై భారీ సినిమాలను అందించిన గొప్ప శిల్పి ఏం రత్నం గారు. వెండితెరపై భారీ దృశ్య కావ్యాలను చూడగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి.‌ ఆయన నమ్మకం, ఆయన ఇచ్చిన బలం వల్లే ఈ రోజు వీరమల్లు ఈ స్థాయికి వచ్చింది'' అని తెలిపారు.

Also Read: వీరమల్లుకు ముందు... నిధి అగర్వాల్ చేసిన సినిమాలు ఎన్ని? ప్రస్తుతం అవి ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఫుల్ డీటెయిల్స్‌

దర్శకుడుగా మాత్రమే కాదు... మనం మరిచిపోయిన చరిత్రను అన్వేషించే వ్యక్తిగా ఈ కథను వెండితెరపైకి తీసుకు రావడం కోసం తాను యుద్ధం చేశానని క్రిష్ జాగర్లమూడి తెలిపారు.‌ లెజెండ్స్ పవన్ కళ్యాణ్ గారు, ఏయం రత్నం గారికి ఎప్పుడు కృతజ్ఞుడునై ఉంటానని తెలిపారు.‌ కొన్ని సంవత్సరాల తమ కృషి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెండితెరపై ఆవిష్కరించబడుతుందని ఆయన తెలిపారు. ఇక నుంచి ఈ సినిమా ప్రేక్షకులది అని పేర్కొన్నారు. ప్రేమ మరియు కోపంతో క్రిష్ జాగర్లమూడి అంటూ తన ట్వీట్ ముగించడం విశేషం.

Also Read: 'ప్రేమ ఎంత మధురం' ఫేమ్ శ్రీరామ్ వెంకట్ కొత్త సీరియల్...జీ తెలుగులో టెలికాస్ట్‌ అవుతున్న 'జయం'... కథ నుంచి యాక్టర్స్ వరకు ఈ డీటెయిల్స్ తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget