Rashmi Gautam: డిజిటల్ డిటాక్స్... సోషల్ మీడియాకు 'జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌతమ్ బ్రేక్
Rashmi Gautam Latest News: ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అందుకు గల కారణాలు పూర్తిగా చెప్పలేదు కానీ ఎందుకు అనేది చెప్పారు.

Rashmi Gautam TV Shows: 'జబర్దస్త్' పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సెలబ్రిటీలలో రష్మీ గౌతమ్ ఒకరు. ఆ షో యాంకరింగ్ చేయడం ద్వారా ఆవిడ చాలా పాపులర్ అయ్యారు. తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో చాలా స్ఫూర్తిగా, నిర్మొహమాటంగా వెల్లడించే రష్మీ గౌతమ్, నెల రోజుల పాటు ఆ సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...
డిజిటల్ డిటాక్స్... వన్ మంత్ బ్రేక్!
''హలో... నెల రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని (డిజిటల్ డిటాక్స్) నిర్ణయించుకున్నాను. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన అంశాలలోనూ కాస్త 'లో'లో ఉన్నాను (అనుకోనివి జరగడం వల్ల బాధ పడటం కావచ్చు). ఈ టైంలో నేను తీసుకునే నిర్ణయాలను సోషల్ మీడియా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకని, బ్రేక్ తీసుకుంటున్నాను. అయితే ఒక్కటి మాత్రం ప్రామిస్ చేయగలను. మరింత శక్తివంతంగా మీ ముందుకు వస్తాను. నేను మునుపటిలా హుషారుగా ఉండటానికి నా ఎనర్జీని మళ్ళీ పొందాలి. నా మీద ఎవరి ప్రభావం ఉండకూడదు. నేను ఎప్పుడూ స్టాంగ్‌గా ఉంటాను. అయితే కొన్ని విషయాలను సరి చేయాల్సిన సమయం వచ్చింది. నేను సోషల్ మీడియాకు కాస్త విరామం ఇస్తున్నా మీ ప్రేమ, అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను'' అని రష్మీ గౌతమ్ పేర్కొన్నారు.
View this post on Instagram
రష్మీకి ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకిలా?
సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడానికి గల కారణం ఏమిటో రష్మీ గౌతమ్ చెప్పారు. అయితే అది పూర్తిగా చెప్పలేదు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో లో ఫేజ్ నడుస్తుందని చెప్పారు. అది ఏమిటనేది చెప్పలేదు. దాంతో రష్మీకి ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకీ నిర్ణయం తీసుకుంది? అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఆవిడ బ్రేక్ ఇచ్చింది సోషల్ మీడియాకు మాత్రమే. టీవీ షోలకు కాదు. ప్రతి వారం 'జబర్దస్త్'లో రష్మీ గౌతమ్ సందడి కంటిన్యూ అవుతుంది. అయితే ఆ ఎపిసోడ్ డ్రస్ తో దిగిన ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేయరు, అది అసలు విషయం. సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఆవిడ దృష్టి వరకు వెళ్లవు.
Also Read: ఇంటర్నేషనల్ లెవెల్ ఫిజిక్‌తో 'పెద్ది' కోసం చెర్రీ రెడీ.. రామ్ చరణ్ డైలీ వర్కౌట్, డైట్ రొటీన్ ఇదే
సో కాల్డ్ సోషల్ మీడియా నెగెటివిటీకి రష్మీ గౌతమ్ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ మూగ జీవాల గురించి ఎన్నోసార్లు పోస్టులు చేశారు. వాటి మీద కూడా వ్యతిరేకత వ్యక్తం అయిన సందర్భాలు ఉన్నాయి. అన్నిటిని తట్టుకుని రష్మీ గౌతమ్ బలంగా నిలబడ్డారు. ఇప్పుడు ఎందుకు బ్రేక్ ఇస్తున్నారో మరి? వెయిట్ అండ్ సి. వన్ మంత్ బ్రేక్ తర్వాత చెబుతారు ఏమో!?





















