Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మాస్ - నెత్తుటి మడుగులో ఎదిగిన నాయకుడు, పోస్టర్‌తో గూస్ బంప్స్ గ్యారంటీ!
Vijay Deverakonda new movie with Dil Raju - SVC59 Update: విజయ్ దేవరకొండ హీరోగా 'రాజా వారు రాణీ గారు' ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు.
యువ కథానాయకుడు 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన 'దిల్' రాజు (Dil Raju) కాంబినేషన్‌లో కొత్త సినిమాను ఇవాళ అధికారికంగా అనౌన్స్ చేశారు. వాళ్లిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా 'ది ఫ్యామిలీ స్టార్'. కుటుంబ కథతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈసారి రూట్ మారింది. రూరల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా మూవీ అప్డేట్ ఇచ్చారు.
రవి కిరణ్ కోలా దర్శకత్వంలో...
Vijay Deverakonda In Ravi Kiran Kola Direction: విజయ్ దేవరకొండ హీరోగా 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేయనున్న కొత్త సినిమాకు 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. దర్శకుడిగా ఆయనకు రెండో చిత్రమిది. 'రాజా వారు రాణీ గారు' తర్వాత మరొక సినిమా చెయ్యలేదు. పల్లెటూరి నేపథ్యంలో, ప్రేమ కథతో తొలి సినిమా తీసిన ఆయన... విజయ్ దేవరకొండ కోసం పక్కా మాస్ అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్ కథను రెడీ చేశారు.
'నా చేతుల మీద ఉన్న రక్తం వాళ్ల చావుకు చిహ్నం కాదు... వ్యక్తిగా నా పునర్జన్మకు సంకేతం' అని విజయ్ దేవరకొండ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. మూవీ అనౌన్స్ చేసిన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... నెత్తురుతో నిండిన కత్తి, ఆ కత్తి పట్టిన చెయ్యి కనిపించాయి. 'కత్తి నాదే... నెత్తురు నాదే... యుద్ధం నాతోనే' అని ఆ పోస్టర్ మీద రాసి ఉంది. దీన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
“The blood on my hands is not of their death.. but of my own rebirth..“
— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024
Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu
రవి కిరణ్ కోలా దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా ప్రొడ్యూస్ చేయనున్నట్లు 'దిల్' రాజు, శిరీష్ గతంలో తెలిపారు. అయితే, అందులో హీరో ఎవరు? అనేది అప్పుడు చెప్పలేదు. విజయ్ దేవరకొండ హీరో అని ఇండస్ట్రీ జనాలకు, మ్యాగ్జిమమ్ ఆడియన్స్‌కు తెలుసు. ఇవాళ ఆ మూవీ అనౌన్స్ చేశారు.
''నెత్తుటి (మడుగులో) అతడు ఎదుగుతాడు. (ప్రజల్ని) పాలిస్తాడు. అంతటా అగ్ని జ్వాలలు మందిస్తాడు'' అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను అనౌన్స్ చేసింది. ఆ సంస్థలో 59వ చిత్రమిది. విజయ్ దేవరకొండ మాస్ అవతారాన్ని ఈ సినిమాలో చూస్తారని పేర్కొంటున్నారు. పాన్ ఇండియా చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పోస్టర్లు విడుదల చేశారు. అన్ని భాషల్లో సినిమాను ఒకేసారి విడుదల చేయనున్నారు.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
In blood, He'll rise, reign & Ignite the Mass Ripples all over! ❤️🔥#SVC59 - @TheDeverakonda's
— Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2024
Mass Incarnation 🔥
A @storytellerkola's Film 🎯#HBDTheVijayDeverakonda 💫
Produced by #DilRaju - #Shirish @SVC_official pic.twitter.com/EkbKMAqQgq