![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vijay Devarakonda : నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు - అది ఇప్పటి ఫోటో కాదు : విజయ్ దేవరకొండ
'ఫ్యామిలీ స్టార్' మూవీ విషయంలో కావాలని కొందరు తనపై నెగటివ్ ప్రచారం చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ పోలీసులను సంప్రదించాడని ఓ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. ఇదే విషయమై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు.
![Vijay Devarakonda : నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు - అది ఇప్పటి ఫోటో కాదు : విజయ్ దేవరకొండ vijay deverakonda denies filing police complaint against those trolling his film family Star Vijay Devarakonda : నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు - అది ఇప్పటి ఫోటో కాదు : విజయ్ దేవరకొండ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/11/b48586bfe4b2e8acaa7a8c2be385a8d31712823424002753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vijay Deverakonda denies filing police complaint against Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్' ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత చిత్రం 'ఖుషి' తో ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన విజయ్ దేవరకొండ.. ఈసారి 'ఫ్యామిలీ స్టార్'తో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని అనుకున్నాడు. 'గీత గోవిందం' కాంబినేషన్ కావడంతో 'ఫ్యామిలీ స్టార్' పై ముందు నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగా రిలీజ్ కి ముందు టీజర్, సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పరుచుకుంది. ఇక ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ మూవీపై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ ప్రచారం జరిగింది. సినిమా బాలేదని పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. అయితే ఇదే విషయంలో విజయ్ దేవరకొండ సైతం పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారని ఓ ఫోటో తాజాగా నెట్టింట కొట్టింది. దీనిపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.
అందులో ఎలాంటి నిజం లేదు.. అది ఇప్పటి ఫోటో కాదు
విజయ్ దేవరకొండను కావాలని కొంతమంది టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ రిలీజ్ రోజే సినిమా బాలేదని సోషల్ మీడియా అంతటా ప్రచారం చేశారు. దీనిపై ఫ్యామిలీ స్టార్ మూవీ యూనిట్ నిజంగానే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విజయ్ దేవరకొండ కూడా ఇదే విషయంలో పోలీసులను సంప్రదించి తనపై నెగిటివ్ ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేశారని బుధవారం రోజు ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టింది. ఆ ఫోటోని చూసిన వాళ్లంతా ఇది నిజమే అని అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని హీరో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు." సినిమా నెగిటివ్ ప్రచారంపై నేను ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియా ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అది ఇప్పటి ఫోటో కాదు. కరోనా టైంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దిగింది. నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు" అని తెలిపాడు.
Checked with @TheDeverakonda. Fake report pic.twitter.com/AFTDe2pylv
— Haricharan Pudipeddi (@pudiharicharan) April 10, 2024
ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్
'ఫ్యామిలీ స్టార్' మూవీ రిలీజ్ అయిన రోజే కావాలని కొందరు సినిమా బాలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అది కాస్త మూవీ ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. సినిమా బాలేదని టాక్ రావడంతో మొదటి ఆట నుంచే 'ఫ్యామిలీ స్టార్' సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. దానికి తోడు విజయ్ దేవరకొండ పై నాన్ స్టాప్ ట్రోలింగ్ జరగడంతో అది కాస్త సినిమాకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దాంతో 'ఫ్యామిలీ స్టార్' మూవీ మొదటి రోజు కేవలం రూ.5.75 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.
పండగ రోజు మాత్రం హౌస్ ఫుల్
'ఫ్యామిలీ స్టార్' మూవీకి ఉగాది పండుగ రోజు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ల ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఈ సినిమాకి ఉగాది రోజు ఏకంగా 60 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటి వీకెండ్ పూర్తయ్యే నాటకి 'ఫ్యామిలీ స్టార్' మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.17 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా అనేది చూడాలి.
Also Read : ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య - ఈసారి పొలిటికల్ డైలాగ్స్‌తో థియేటర్స్ దద్దరిల్లడం గ్యారెంటీ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)