అన్వేషించండి

NBK109 : ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య - ఈసారి పొలిటికల్ డైలాగ్స్‌తో థియేటర్స్ దద్దరిల్లడం గ్యారెంటీ!

నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న 'NBK109' సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో పవర్ ఫుల్ ఎమ్మెల్యేగా కనిపిస్తారని తాజా సమాచారం.

Balakrishna To Become Reel Life MLA For #NBK109 : నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సక్సెస్ ఫుల్ పొలిటీషన్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఏపీలోని హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రియల్ లైఫ్ లోనే కాదు రీల్ లైఫ్ లో అంటే బాలయ్య చేసే సినిమాల్లోనూ పొలిటికల్ టచ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా బోయపాటి - బాలయ్య సినిమాల్లో అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య బాలయ్యతో సినిమా చేస్తున్న కుర్ర దర్శకులు కూడా  ఆయనతో పొలిటికల్ డైలాగ్స్ చెప్పిస్తున్నారు. అయితే ఈసారి బాలయ్య తన కొత్త సినిమాలో ఏకంగా పొలిటీషియన్ గా కనిపించబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది.

'NBK109' లో ఎమ్మెల్యే గా బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. 'NBK109' వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా గ్లింప్స్ విడుదలై భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుందట. డైరెక్టర్ బాబి ఈ సినిమాలో బాలయ్యను పొలిటీషన్ గా చూపించబోతున్నాడట. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఓ పాత్రలో పవర్ ఫుల్ ఎమ్మెల్యేగా కనిపిస్తాడని తాజా సమాచారం. సరిగ్గా ఏపీ ఎలక్షన్స్ వేళ తన కొత్త సినిమాలో బాలయ్య ఎమ్మెల్యేగా కనిపించబోతున్నాడనే వార్త బయటకు రావడం సినీ, రాజకీయ వర్గాల్లో సర్వత్ర ఆసక్తికరంగా మారింది.

'NBK109' టైటిల్ అదేనా?

NBK109 మూవీ కోసం బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా ఓ మాస్ టైటిల్ ని మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబి అండ్ టీం ఈ చిత్రానికి 'వీరమాస్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ టైటిల్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. త్వరలోనే మేకర్స్ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. 

కీలక పాత్రల్లో స్టార్ సెలబ్రిటీలు

బాలయ్య - బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'NBK109' మూవీలో స్టార్ కాస్టింగ్ భాగం అవుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన జెర్సీ మూవీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తెలుగమ్మాయి చాందిని చౌదరి, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే 'యానిమల్' మూవీలో విలన్ గా అదరగొట్టిన బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబి డియోల్ ఇందులో మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. మరో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో సైతం ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నో చెప్పిన నాగ చైతన్య - కారణం అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget