అన్వేషించండి

Naga Chaitanya : హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నో చెప్పిన నాగ చైతన్య - కారణం అదేనా?

'మజిలీ' తర్వాత శివ నిర్వాణ నాగచైతన్యతో సినిమా చేసేందుకు కొంత కాలంగా చర్చలు జరుపుతూ వస్తున్నాడు. అయితే తాజాగా శివ నిర్వాణ చెప్పిన కథ చైతూకి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

Naga Chaitanya Said No To Majili Director : అక్కినేని నాగచైతన్య కెరీర్లో వచ్చిన మైల్ స్టోన్ మూవీస్ లో 'మజిలీ' ముందు వరుసలో ఉంటుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ హీరో, హీరోయిన్లుగా నటించారు. కంప్లీట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 'ఏం మాయ చేసావే' తర్వాత మళ్లీ చై - సామ్ కాంబోలో మెమొరబుల్ మూవీ గా 'మజిలీ' నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అలాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నాగచైతన్య నో చెప్పినట్లు తెలుస్తోంది. 

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి నో చెప్పిన చైతూ

'మజిలీ'తో నాగచైతన్య కి మంచి సక్సెస్ అందించిన శివ నిర్వాణ మరోసారి చైతుతో మూవీ చేసేందుకు గత కొంతకాలంగా చర్చలు జరుపుతూ వస్తున్నాడు. దీంతో మరోసారి 'మజిలీ' కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలిసి అక్కినేని ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు కోసం క్యూరియాసిటీ తో ఉన్నారు. అయితే తాజాగా చైతు శివ నిర్వాణకి నో చెప్పాడట. శివ నిర్వాణ చెప్పిన కథ నాగచైతన్యకి అంతగా నచ్చలేదట. దాంతో చైతూ ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్లు తెలిసింది. షైన్ స్క్రీన్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలని అనుకున్నప్పటికీ చై రిజెక్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. మరి శివ నిర్వాణ చైతూకి చెప్పిన కథలో మార్పులు చేసి మరో హీరోకి వినిపించి ఓకే చేయించుకుంటాడా? లేక మరో ఫ్రెష్ స్టోరీ రెడీ చేసి వేరే హీరోతో ప్రాజెక్ట్ చేస్తాడా అనేది చూడాలి. 

'ఖుషి' లో వర్కౌట్ కానీ మ్యాజిక్

శివ నిర్వాణ చివరగా విజయ్ దేవరకొండ, సమంతను హీరో, హీరోయిన్లుగా పెట్టి 'ఖుషి' సినిమాని తెరకెక్కించాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా గత ఏడాది విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా శివ నిర్వాణ సినిమాల్లో ఉండే ప్యూర్ ఎమోషన్స్ 'ఖుషి' లో కనిపించలేదు. 'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాల్లో వర్క్ అవుట్ అయిన మ్యాజిక్ 'ఖుషి'లో వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

అక్టోబర్ లో రానున్న 'తండేల్' 

నాగచైతన్య చివరగా 'కస్టడీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ని మూటగట్టుకుంది  ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్' సినిమా చేస్తున్నాడు. చైతు కెరియర్ లోనే ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని GA2 పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో చైతుకి జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో చైతు మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : ప్రభాస్‌ 'కల్కి 2989 ఏడీ' రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌, తెరపైకి మరో కొత్త డేట్‌? - ఆ రోజే బిగ్‌ అప్‌డేట్‌!

టాప్ హెడ్ లైన్స్

Vaazha 2 OTT : రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
Toxic Ladies Ladies : ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
Samantha : ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Down India: లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం.. ఛాన్స్ ఉందా
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డ్.. ఛాన్స్ ఉందా
Trisha: మళ్ళీ ట్రెండింగ్‌లోకి త్రిష... తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్... ఎందుకంటే?
మళ్ళీ ట్రెండింగ్‌లోకి త్రిష... తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్... ఎందుకంటే?
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
New WhatsApp Subscription Plan: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
Samantha : ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
Embed widget