Vijay Devarakonda: ‘కల్కి 2898 AD’పై స్పందించిన విజయ్ దేవరకొండ - తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని సైతం మార్చేసిన రౌడీ బాయ్
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ‘కల్కి 2898 AD’లో అర్జునుడి పాత్రలో నటించి మెప్పించాడు. ఇక తాజాగా ఈ మూవీపై తన స్టైల్‌లో రివ్యూ కూడా ఇచ్చాడు. కలెక్షన్స్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Vijay Devarakonda Review On Kalki 2898 AD: ప్రస్తుతం ప్రేక్షకుల్లో ‘కల్కి 2898 AD’ జోరు ఇంకా తగ్గలేదు. ఒకసారి చూసినా కూడా ఇంకా పూర్తిస్థాయిలో తృప్తిపడని చాలామంది ఆడియన్స్.. ఈ మూవీని మళ్లీ మళ్లీ ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం థియేటర్లకు వెళ్తున్నారు. ఇక ఈ మూవీలో చాలామంది స్టార్లు గెస్ట్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ‘కల్కి 2898 AD’ సినిమాకు సంబంధించి ఎలాంటి స్పాయిలర్స్ ఇవ్వద్దని చెప్పినా.. ఇందులో ఏయే స్టార్లు ఏయే రోల్స్‌లో కనిపించారో బయటికొచ్చేసింది. ఇందులో మరో కీలక పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ.. ఈ మూవీను, ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.
డీపీ మార్చాడు..
‘కల్కి 2898 AD’లో హీరో ప్రభాసే అర్జునుడి పాత్రలో కనిపిస్తాడని చాలామంది ప్రేక్షకులు ఊహించారు. కానీ అనూహ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. అర్జునుడి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మూవీ రిలీజ్‌కు ముందే అర్జునుడి విజయ్ కనిపించనున్నాడని తెలిసిన కొందరు నెటిజన్లు.. తనపై తీవ్రంగా ట్రోల్స్ చేశారు. అర్జునుడి పాత్రలో విజయ్‌ను చూడలేమంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ స్క్రీన్‌పై తను వచ్చినప్పుడు మాత్రం చాలామంది ఎంజాయ్ చేశారు. ఇక తనే అర్జునుడు అని అఫీషియల్‌గా బయటపడడంతో తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ డీపీను కూడా మార్చాడు ఈ యంగ్ హీరో. తాజాగా ‘కల్కి 2898 AD’పై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.
కొత్త లెవెల్..
‘ఇప్పుడే సినిమా చూశాను. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆనందంలో మునిగిపోయాను. ఇండియన్ సినిమాలో కొత్త లెవెల్ అన్‌లాక్ అయ్యింది. అసలు ఏంటిది? ఈ సినిమా కచ్చితంగా 1000 కోట్లకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది’ అంటూ ‘కల్కి 2898 AD’ గురించి తన స్టైల్‌లో రివ్యూ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. మొదటి రోజే ఈ సినిమాను చూడలేకపోయిన చాలామంది స్టార్లు.. ఇప్పుడిప్పుడే ‘కల్కి 2898 AD’ను చూసి తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీలు ఈ మూవీపై తమ స్టైల్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు.
Just watched the film.
— Vijay Deverakonda (@TheDeverakonda) June 29, 2024
I don’t know what to say..
Overwhelmed
Indian cinema new level unlocked
Wth was that!
I hope it makes a 1000 crores and more.. ❤️#Kalki2898AD
కలెక్షన్స్ బాగున్నాయి..
‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు సమానంగా అమితాబ్ బచ్చన్‌పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. అశ్వద్ధామగా అమితాబ్ నటన చాలా బాగుందని, ఈ వయసులో అంత ఎనర్జీతో నటించడం ఆయనకే సాధ్యమని బాలీవుడ్ స్టార్లు అంటున్నారు. దీపికా పదుకొనెతో పాటు ఇతర యాక్టర్లు కూడా తాము ఉన్నంతసేపు మంచి నటనను కనబరిచారని పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. ఇండియాలో మొదటిరోజు ‘కల్కి 2898 AD’ కలెక్షన్స్ రూ.95.3 మార్క్‌ను టచ్ చేశాయి. ఓవర్సీస్‌లో రూ.61 కోట్లు దాటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి 2898 AD’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.114 కోట్లు అని సమాచారం.
Also Read: సెకండ్ పార్ట్ కోసమే ‘కల్కి 2898 AD’ సినిమాను ఒప్పుకున్నాను, డబ్బు గురించి కాదు - కమల్ హాసన్