అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kamal Haasan: సెకండ్ పార్ట్ కోసమే ‘కల్కి 2898 AD’ సినిమాను ఒప్పుకున్నాను, డబ్బు గురించి కాదు - కమల్ హాసన్

Kamal Haasan: ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాత్రలకు ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ సినిమాలో తనది చిన్న రోల్ అయినా ఎందుకు చేయడానికి ఒప్పుకున్నారో బయటపెట్టారు కమల్.

Kamal Haasan About Kalki 2898 AD: గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా ‘కల్కి 2898 AD’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్‌గా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ విడుదలయినప్పటి నుండి ఇందులో ప్రతీ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక హీరో ప్రభాస్ అయినా కూడా తనతో సమానంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ క్యారెక్టర్లు ఉన్నాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వీరిద్దరూ కూడా ‘కల్కి 2898 AD’ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీలో తాను చేసిన యస్కిన్ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్.

చెప్పకూడదు..

‘కల్కి 2898 AD’లో యస్కిన్ అనే పాత్రలో కనిపించారు కమల్ హాసన్. ఈ పాత్రకు సంబంధించి ప్రత్యేకంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ‘‘ఎవరైనా నా దగ్గరకు వచ్చి యస్కిన్ వయసు గురించి అడిగితే మీరే గెస్ చేసుకోండి అని ధైర్యంగా చెప్తాను. ఒకవేళ తనకు 180 ఏళ్లు ఉంటాయేమో. అంతకు మించి నేనేం చెప్పకూడదు. ఎందుకంటే ట్రైలర్‌లో కూడా వేచి చూడండి కొత్త ప్రపంచం రాబోతుంది అనే ఉంది. అంతకు మించి ఏం లేదు’’ అన్నారు కమల్ హాసన్. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ప్రపంచంలో తాను కూడా ఒక భాగం కావాలనే ఆలోచనతో మాత్రమే కాకుండా ‘కల్కి 2898 AD’లో నటించడానికి మరొక కారణం కూడా ఉందని రివీల్ చేశారు.

చిన్న రోల్..

‘‘నేను సెకండ్ పార్ట్ కోసమే ‘కల్కి 2898 AD’ను సైన్ చేశాను. ‘కల్కి 2898 AD’లో నేను చాలా చిన్న రోల్ చేశాను. కానీ సెకండ్ పార్ట్ మాత్రమే నాలో ఆసక్తి క్రియేట్ చేసింది. దీనికోసం నేను కొన్నిరోజులే షూట్ చేశాను. కానీ వాళ్లకు నా మీద ఉన్న నమ్మకం నాకు నచ్చింది. ఇది డబ్బు గురించి కాదు. ఒక మంచి నిర్ణయం వల్ల లేదా ఒక చెడు నిర్ణయం వల్ల డబ్బు రావచ్చు, పోవచ్చు. కానీ డబ్బు గురించి ఆలోచించకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది ప్రశంసలతో సమానం. వైజయంతి సినిమా ఆ గౌరవాన్ని నాకు ఇచ్చింది. ఈ సినిమాలో నన్ను మరింత ముందుకు తీసుకెళ్తూ ఆ గౌరవాన్ని కాపాడుతుంది’’ అని గర్వంగా తెలిపారు కమల్ హాసన్.

అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే..

‘కల్కి 2898 AD’తో ప్యాన్ వరల్డ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు కమల్ హాసన్. ఇక త్వరలోనే తాను హీరోగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘ఇండియన్ 2’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ కూడా పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకుంది. ఇక జూన్‌లోనే ఈ సినిమా విడుదల అవుతుందని ప్రకటించినా.. ఫైనల్‌గా జులై 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీని తర్వాత మణిరత్నంతో ‘థగ్ లైఫ్’ అనే మరో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు కమల్ హాసన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ అన్నీ ప్యాన్ ఇండియా మూవీలతోనే బిజీ అయిపోయారు ఈ సీనియర్ హీరో.

Also Read: 'కల్కి2898 AD' చిత్రంలో లార్డ్‌ కృష్ణ పాత్ర పోషించింది ఈ నటుడే - ఎవరో గుర్తుపట్టారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget