Kalki 2898 AD: 'కల్కి2898 AD' చిత్రంలో లార్డ్ కృష్ణ పాత్ర పోషించింది ఈ నటుడే - ఎవరో గుర్తుపట్టారా?
Lord Krishna in Kalki: భారీ అంచనాలతో థియేటర్‌కు వచ్చిన ఆడియన్స్‌కి నాగ్ అశ్విన్ వరుస సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కల్కితో విజువల్ వండర్ ట్రీట్ ఇచ్చిన ఆయన లార్డ్ కృష్ణను చూపించకుండ సస్పెన్స్‌లో ఉంచాడు.

Here Is Details About Lord Krishna Role in Kalki 2898 AD: టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్-పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'కల్కి 2898 AD'. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా గురువారం (జూన్ 27) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్‌హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. థియేటర్లని హౌజ్ ఫుల్‌తో కలకలాడుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, సీనియర్ నటి శోభన వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమాపై ముందు మంచి బజ్ నెలకొంది. దీం
తో భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ నాగ్ అశ్విన్ ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇచ్చాడు. రిలీజ్‌కు ముందు పెద్దగా హడావుడి చేయకుండ కల్కి కథను మాత్రమే రివీల్ చేశాడు. అయినా నాగ్ అశ్విన్ కథ రివీల్ చెసినప్పుడు వచ్చిన ఎగ్జయిట్‌మెంట్ కంటే వెండితెరపై సినిమా చూస్తున్నప్పుడు మరింత ఎగ్జయిట్ అయ్యామంటున్నారు ప్రేక్షకులు. ఇక మధ్యలో అతిథి పాత్రలను చూసి థ్రిల్ అయ్యారు. విడుదల వరకు ఎక్కడ కూడా మూవీ నటీనటుల పూర్తి వివరాలు బయటకు రాకుండ కల్కి టీం జాగ్రత్త పడింది. ముఖ్యంగా ఎస్‌ఎస్ రాజమౌళి, రాజేంద్రప్రసాద్, రామ్ గోపాల్ వర్మల అతిథి పాత్రలను ఎక్కడ రివీల్ చేయకుండ థియేటర్‌లో ఆడియన్స్‌ని ఫుల్ సర్‌ప్రైజ్ చేశారు.
అయితే కల్కి సినిమాలో ఆడియన్స్‌ని సస్పెన్స్‌లో ఉంచిన ఒక ముఖ్యపాత్ర ఒకటి ఉంది. అదే లార్డ్ కృష్ణ. కురుక్షేత్రంలో సన్నివేశం సీన్స్‌లో ఎక్కడ కూడా కృష్ణుడు ఫేస్ బయటపెట్టలేదు. సినిమాలో ముఖ్యమైన పాత్రైన కృష్ణుడు పాత్రను చూపించకుండ అందరిని సస్పెన్స్‌లో ఉంచాడు నాగ్ అశ్విన్. దీంతో ఇప్పుడంతా కృష్ణుడు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ పాత్రలో కనిపించిన నటుడు ఎవరంటూ ఆరా తీయగా.. ఆయన ఎవరో బయటకు వచ్చేసింది. ఈ లార్డ్ లార్డ్ కృష్ణగా నటించిన మరెవరో కాదు నటుడు కృష్ణకుమార్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోష్ మీడియాలో వెల్లడించారు.
View this post on Instagram
సినిమాలోని తన పాత్రకు సంబంధించి విజువల్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ తనకు అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ఇలాంటి సినిమాలో లార్డ్ కృష్ణగా నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు కృష్ణకుమార్ పేర్కొన్నాడు. కాగా కృష్ణకుమార్ గతంలో సూర్య హిట్ మూవీ 'ఆకాశం నీ హద్దురా'లో హీరో స్నేహితుడిగా, పైలట్‌గా కనిపించాడు. ఇక ఈ పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్ (బుట్టబొమ్మ ఫేం) అందించిన వాయిస్ ఓవర్ అందించారు. కాగా కనిపించని కాసేపు అయినా కృష్ణుడుగా.. కృష్ణకుమార్ పాత్ర పవర్ఫుల్‌గా ఆకట్టుకుంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' జోరు - ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డ్ బ్రేక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

