అన్వేషించండి

మణిపూర్‌లో విడుదలైన 'ఉరి' - 25 ఏళ్ల తర్వాత ప్రదర్శితమైన మొదటి హిందీ సినిమాగా రికార్డ్!

77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణిపూర్ రాష్ట్రంలోని చుర్ చంద్రపూర్ జిల్లాలో ఓ తాత్కాలిక థియేటర్లో విక్కీ కౌశల్ నటించిన 'ఉరి ద సర్జికల్' స్ట్రైక్ సినిమాని ప్రదర్శించారు.

77వ స్వాతంత్ర దినోత్సవం మణిపూర్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. అందుకు కారణం సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ రాష్ట్రంలో మొదటిసారి ఓ హిందీ సినిమా ప్రదర్శనకు నోచుకోవడమే. తీవ్రవాదుల హెచ్చరికతో ఇన్ని సంవత్సరాలు హిందీ సినిమాలకు దూరమైన మణిపూర్ రాష్ట్ర ప్రజలు, థియేటర్ల యజమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓ పక్క జాతుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఓ విద్యార్థి సంఘం చేసిన సాహసంతో ఓ బాలీవుడ్ సినిమా మణిపూర్ లో ప్రదర్శితమైంది. ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో చివరగా విడుదలైన బాలీవుడ్ సినిమా 'కుచ్ కుచ్ హోతా హై'. ఆ రాష్ట్రంలో 1998 నుంచి 2023 ఆగస్టు 14 వరకు బాలీవుడ్ పై నిషేధం కొనసాగింది.

అయితే 2023 ఆగస్టు 15 మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణిపూర్ రాష్ట్రంలోని చుర్ చంద్రపూర్ జిల్లాలోని రంగ్ కై లో ఉన్న ఓ తాత్కాలిక థియేటర్లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన' ఉరి ద సర్జికల్ స్ట్రైక్' సినిమాను ప్రదర్శించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని థియేటర్లో ప్రదర్శించడానికి ముందు జాతీయ గీతాలాపన చేశారు. మైతీయులకు, కుకీలకు మధ్య ఈ జిల్లాలోనే ఎక్కువ ఘర్షణలు జరిగాయి. హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే కుకీల అనుకూల విద్యార్థి సంఘం విక్కీ కౌశల్ 'ఉరి ద సర్జికల్ స్ట్రైక్' సినిమాని ప్రదర్శించింది.

మైతీయుల అతివాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ హిందీ సినిమాలను ప్రదర్శించకూడదని సుమారు 25 ఏళ్ల కింద గట్టి హెచ్చరిక జారీ చేసింది. అలా నిషేధం విధించిన వారం రోజుల్లోనే అక్కడ తిరుగుబాటుదారులు హిందీ సినిమాలకు సంబంధించిన 6000 నుంచి 8 ఆడియో, వీడియో క్యాసెట్లు, కాంపాక్ట్ డిస్క్ లను తగలబెట్టేశారు. అప్పటినుంచి రాష్ట్రంలో ఒక్క హిందీ సినిమా కూడా విడుదల కాలేదు. కానీ దేశానికి వ్యతిరేకమైన ఇలాంటి నిషేధాలపై తిరగబడాలనే ఉద్దేశంతోనే 'ఉరి ద సర్జికల్ స్ట్రైక్' సినిమాని ప్రదర్శించామని స్థానిక తెగల సంఘ నేత గింజ వల్జాంగ్ ఓ ప్రకటనలో చెప్పారు. తీవ్రవాదులు దశాబ్దాల పాటూ గిరిజన తెగలను మాయ చేశారని, జనాలు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

ఇక 'ఉరి ద సర్జికల్ స్ట్రైక్' సినిమా విషయానికొస్తే.. 2016 లో జరిగిన 'ఉరి అటాక్' ఆధారంగా ఆదిత్యధర్ ఈ సినిమాని తరికెక్కించారు.   విక్కీ కౌశల్, యామి గౌతమ్, మోహిత్ రైనా, కృతి కుల్హరి, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2019 జనవరి 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ ని అందుకుంది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం.

Also Read : మయోసైటీస్‌తో సమంత ఎంతలా పోరాడిందో చెప్పలేను - ఆమె ముఖంలో నవ్వు చూడాలి, అదే నా కోరిక : విజయ్ దేవరకొండ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Embed widget